కన్నెపల్లి వద్ద ఎత్తిపోతలు ప్రారంభం
దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌ను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్‌లోని 4 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు కొద్దిసేపటి కిందటే నీటిని ఎగువకు తరలిస్తున్నారు. మంగళవారం నుండే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నుంచి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించగా, బుధవారం కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని అన్నారం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు. ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజ్ బ్యాక్ వాటర్‌ను ఎగువ ప్రాంతానికి తరలిస్తున్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్‌లోని 4 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు రావడంతో ఇంజినీర్లు కొద్దిసేపటి కిందటే నీటిని ఎగువకు తరలిస్తున్నారు. మంగళవారం నుండే అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌ల నుంచి నీటిని తరలించే ప్రక్రియను ప్రారంభించగా, బుధవారం కన్నెపల్లి పంప్ హౌజ్ ద్వారా నీటిని అన్నారం బ్యారేజ్‌కు తరలిస్తున్నారు.
ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిస్తే ఆ వరద నీరు దిగువ ప్రాంతానికి వచ్చి చేరుతుందని ఇంజినీర్లు అంచనా వేశారు. అందువల్లే ఇప్పటివరకు కన్నెపల్లి పంప్‌హౌజ్ నుంచి నీటిని ఎత్తిపోయకుండా నిలిపివేశారు. అయితే, ఎస్సారెస్పీ, కడెం ప్రాజెక్టుల ద్వారా వరద నీరు అంచనాలకు తగ్గట్టుగా ఎల్లంపల్లికి వచ్చి చేరలేదు. దీంతో అధికారులు మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని తరలించాలని నిర్ణయించారు.