ఐపీవోకు సిద్ధమవుతున్న కల్యాణ్ జ్యువెలర్స్!

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ దిగ్గజం కల్యాణ్ జ్యువెలర్స్ ఐపీవోకు సిద్ధమవుతోంది. ఆగష్టు చివరి వారంలో కానీ సెప్టెంబర్ నెలలో ఐపీవోకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం సెబీ వద్ద ముసాయిదా ప్రణాళిక పత్రాలను అందించనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్-19 వ్యాప్తి అనంతరం దేశంలో ఆభరణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. పైగా, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆభరణాలకు మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఐపీవోకు వెళ్లాలనే […]

Update: 2020-08-02 03:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ దిగ్గజం కల్యాణ్ జ్యువెలర్స్ ఐపీవోకు సిద్ధమవుతోంది. ఆగష్టు చివరి వారంలో కానీ సెప్టెంబర్ నెలలో ఐపీవోకు సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించింది. దీనికి సంబంధించిన అనుమతుల కోసం సెబీ వద్ద ముసాయిదా ప్రణాళిక పత్రాలను అందించనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్-19 వ్యాప్తి అనంతరం దేశంలో ఆభరణాలకు భారీగా డిమాండ్ పెరిగింది. పైగా, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆభరణాలకు మరింత డిమాండ్ పెరుగుతుందనే అంచనాలతో ఐపీవోకు వెళ్లాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్టు కంపెనీ వర్గాలు తెలిపాయి.

కాగా, కంపెనీ మొత్తం ప్రాథమిక, సెకండరీ మార్కెట్ల ద్వారా సుమారు రూ. 1,800 కోట్ల నిధులను సమీకరించాలని భావిస్తున్నట్టు పేర్కొంది. ప్రస్తుత సంవత్సర మార్చి చివరికి కల్యాణ్ జ్యువెలరీకి గణనీయమైన వినియోగదారులు ఉన్నారని, ఆభరణాల పరిశ్రమ కొవిడ్-19 తర్వాత పుంజుకోవడంతో విశ్వాసం పెరిగిందని తెలుస్తోంది. గతంలోనూ 2018 ఏడాది కల్యాణ్ జ్యువెలరీ కంపెనీ ఐపీవోకు రావాలని భావించినప్పటికీ, అనుకోని కారణాలతో అప్పటి ఐపీవో వాయిదా పడింది. స్టాక్ ఎక్స్ఛేంజ్, సెబీ ఆమోదం అనంతరం 2021 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో ఐపీవో ప్రారంభమవొచ్చని అంచనాలున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా కల్యాణ్ జ్యువెలరీకి 19 రాష్ట్రాల్లో 135 షోరూమ్‌లు, 328 స్టోర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఐదు దేశాల్లో బ్రాంచ్‌లు ఉన్నాయి.

Tags:    

Similar News