వరంగల్ IRR భూ బాధితులకు గుడ్‌ న్యూస్

దిశ, కాశిబుగ్గ : రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ సమస్యకు పరిష్కారం దొరకడంతో IRR రెండొందల ఫీట్ల భూమి బాధితుల సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. సమైక్య […]

Update: 2021-11-09 10:26 GMT

దిశ, కాశిబుగ్గ : రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ సమస్యకు పరిష్కారం దొరకడంతో IRR రెండొందల ఫీట్ల భూమి బాధితుల సమాఖ్య ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంగళవారం వరంగల్‌లోని రాజశ్రీ గార్డెన్‌లో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసారు. ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ.. సమైక్య పాలనలో ఈ ప్రాంత అభివృద్ధి పై వివక్ష జరిగిందన్నారు.

ఇన్నర్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులలో కొందరు లేని పోని అపోహలు సృష్టించారని, సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పలుమార్లు చర్చించి పరిష్కరించడం జరిగిందన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్‌లో నష్టపోయిన ప్రతీ కుటుంబాన్ని గుండెల్లో పెట్టుకుంటాం.. దశల వారీగా రోజుకు కొందరి చొప్పున పరిహారం చెక్కులు అందజేస్తామన్నారు. కార్యక్రమంలో వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ 200 ఫీట్ల భూ బాధితుల సమాఖ్య గ్రేటర్ వరంగల్, వరంగల్ జిల్లా అధ్యక్షులు జజ్జూరి ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి గుండంపెల్లి వెంకటరమణ, కోశాధికారి కోరిపెల్లి సారయ్య, ఉపాధ్యక్షులు బజ్జూరి ప్రభాకర్, సహాయ కార్యదర్శి యండీ రియాజుద్దిన్, టీఆర్ఎస్ నాయకుడు బిల్ల పవన్, ముఖ్య సలహాదారులు, కార్యవర్గ సభ్యులు, భూనిర్వాసితులు పాల్గొన్నారు.

Tags:    

Similar News