టీఆర్‌ఎస్ 9… బీజేపీ 3 స్థానాలు కైవసం
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు 9 డివిజన్లను కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్‌బీ 1స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు 9వ డివిజన్‌లో చీకటి శారద, 13వ డివిజన్‌లో సురేష్ జోషి, 23వ డివిజన్‌లో యొలగం లీలావతి, 24వ డివిజన్‌లో రామ తేజస్విని, 28వ డివిజన్‌లో గందె కల్పన, 29వ డివిజన్‌లో గుండు సుధారాణి, 51వ డివిజన్‌లో బోయినిపెల్లి రంజిత్‌రావు, 60వ డివిజన్‌లో అభినవ్ […]
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్ కార్పోరేషన్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఇప్పటి వరకు 9 డివిజన్లను కైవసం చేసుకుంది. బీజేపీ 3, కాంగ్రెస్ 1, ఐఏఎఫ్‌బీ 1స్థానాన్ని తమ ఖాతాలో వేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థులు 9వ డివిజన్‌లో చీకటి శారద, 13వ డివిజన్‌లో సురేష్ జోషి, 23వ డివిజన్‌లో యొలగం లీలావతి, 24వ డివిజన్‌లో రామ తేజస్విని, 28వ డివిజన్‌లో గందె కల్పన, 29వ డివిజన్‌లో గుండు సుధారాణి, 51వ డివిజన్‌లో బోయినిపెల్లి రంజిత్‌రావు, 60వ డివిజన్‌లో అభినవ్ భాస్కర్, 61వ డివిజన్‌లో ఎలకంటి రాములు విజయం సాధించారు. అలాగే బీజేపీ అభ్యర్థులు 30వ డివిజన్‌లో రావుల కోమల, 52వ డివిజన్‌లో చాడ స్వాతి, 59వ డివిజన్‌లో గుజ్జుల వసంత లు గెలుపొందారు. 22వ డివిజన్‌లో ఐఏఎఫ్‌బీ అభ్యర్థి బస్వరాజు కుమార్, 10వ డివిజన్‌లో కాంగ్రెస్ తోట వెంకటేశ్వర్లు వారి సత్తాచాటి గెలిచారు.