వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటుపై నోటిఫికేషన్
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ఏ జిల్లాలోకి ఏయే మండలాలు చేరుస్తున్న విషయాన్ని పొందుపర్చింది. హన్మకొండ జిల్లాను 12 మండలాలతో, వరంగల్ జిల్లాలో 15మండలాలతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలుస్తుండగా.. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ధర్మసాగర్, వేలేరు, […]
దిశ ప్రతినిధి, వరంగల్: వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. జిల్లాల పునర్విభజనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో ఏ జిల్లాలోకి ఏయే మండలాలు చేరుస్తున్న విషయాన్ని పొందుపర్చింది. హన్మకొండ జిల్లాను 12 మండలాలతో, వరంగల్ జిల్లాలో 15మండలాలతో ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదించింది. ప్రతిపాదిత అంశాల ప్రకారం.. హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం మొత్తం కలుస్తుండగా.. స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన ధర్మసాగర్, వేలేరు, పరకాల నియోజకవర్గానికి చెందిన పరకాల, నడికూడ, దామెర మండలాలు, హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలు, హుజురాబాద్ నియోజకవర్గం నుంచి కమాలాపూర్ కలుస్తున్నాయి. అలాగే వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి ఐనవోలు, హసన్‌పర్తి మండలాలు కూడా హన్మకొండ జిల్లాలోనే ఉండనున్నాయి.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో ప్రస్తుత వరంగల్ నియోజకవర్గం మొత్తం ఉంటుంది. పరకాల నియోజకవర్గానికి చెందిన గీసుగొండ, ఆత్మకూరు, శాయంపేట, సంగెం మండలాలు, వర్ధన్నపేట నియోజకవర్గం నుంచి వర్ధన్నపేట, పర్వతగిరి, పాలకుర్తి నియోజకవర్గం నుంచి రాయపర్తి, నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాలు నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖానాపురం, నెక్కొండ వరంగల్ జిల్లాలో ఉండనున్నాయి. వరంగల్ జిల్లాలో వరంగల్, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉండనున్నాయి. కొత్తగా కమాలాపూర్ మండలం పరకాల పరిధిలోకి రావడం గమనార్హం. కొత్తగా ఏర్పడబోయే హన్మకొండ జిల్లాలో 12 రెవెన్యూ మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు ఉండనున్నాయి. అలాగే వరంగల్ జిల్లాలో 15 రెవెన్యూ మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఉంటాయి.రెండు రెవిన్యూ డివిజన్లు.. ఆరు నియోజకవర్గాల సమ్మిళితంతో హన్మకొండ జిల్లా అవతరించనుంది. ఐదు నియోజకవర్గాల సమ్మిళితంతో, రెండు రెవెన్యూ డివిజన్లు (వరంగల్, నర్సంపేట)తో వరంగల్ జిల్లా అవతరించనుంది.
హన్మకొండ జిల్లా ప్రతిపాదిత మండలాలు
హన్మకొండ
కాజీపేట
ఐనవోలు
హసన్‌పర్తి
వేలేరు
ధర్మసాగర్
ఎల్కతుర్తి
భీమదేవరపల్లి
కమాలాపూర్
పరకాల
నడికూడ
దామెర
వరంగల్ జిల్లా ప్రతిపాదిత మండలాలు
వరంగల్
ఖిలావరంగల్
గీసుగొండ
ఆత్మకూరు
శాయంపేట
వర్ధన్నపేట
రాయపర్తి
పర్వతగిరి
సంగెం
నర్సంపేట
చెన్నారావుపేట
నల్లబెల్లి
దుగ్గొండి
ఖానాపూర్
నెక్కొండ