కంగనను చంపేస్తా: బాలీవుడ్ నటుడు

దిశ, వెబ్‌డెస్క్: కంగనా రనౌత్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నచ్చని విషయాలను ఓపెన్‌గా చెప్పేసి.. వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకానొక సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతోనే గొడవకు దిగి ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో అయితే చెప్పక్కర్లేదు. అసలు వాళ్లు రైతులే కాదు వంద రూపాయలిస్తే ఏం చెప్పినా చేసే దళారులు అంటూ కామెంట్ చేసింది. ఈ విషయాన్ని దిల్ జిత్, ప్రియాంక చోప్రా ఖండించగా కడిగిపారేసింది. దిల్‌జిత్, […]

Update: 2021-01-30 03:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: కంగనా రనౌత్ అంటే వివాదాలకు కేరాఫ్ అడ్రస్. నచ్చని విషయాలను ఓపెన్‌గా చెప్పేసి.. వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకానొక సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతోనే గొడవకు దిగి ఇబ్బందులు ఎదుర్కొంది. ఇక ఫార్మర్స్ ప్రొటెస్ట్ విషయంలో అయితే చెప్పక్కర్లేదు. అసలు వాళ్లు రైతులే కాదు వంద రూపాయలిస్తే ఏం చెప్పినా చేసే దళారులు అంటూ కామెంట్ చేసింది. ఈ విషయాన్ని దిల్ జిత్, ప్రియాంక చోప్రా ఖండించగా కడిగిపారేసింది. దిల్‌జిత్, కంగన అయితే సోషల్ మీడియాలో వార్‌కు దిగారు.

సొసైటీలో స్టేటస్ ఉన్న సెలెబ్రిటీలని మరిచిపోయి.. ఒకరిపై మరొకరు దిగజారి సెటైర్లు వేసుకున్నారు. రిపబ్లిక్ డే రోజున ఫార్మర్స్ ఎర్రకోటపై జాతీయజెండాను తీసేసి కాషాయం జెండాను ఆవిష్కరించడంపై మండిపడిన కంగన.. ప్రపంచం మొత్తం నవ్వుతోంది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? అంటూ దిల్ జిత్, ప్రియాంకను ప్రశ్నించింది. అప్పుడు దిల్ జిత్ ఏం రిప్లై ఇవ్వలేదు. కానీ, లేటెస్ట్‌గా కంగనకు సంబంధించిన విషయమై ఇచ్చిన రిప్లై ట్రెండ్ అయింది.

తాజాగా కంగన తన ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లో ఇందిరా గాంధీ పాత్రలో కనిపించబోతున్నానని ప్రకటించింది.అంత గొప్ప మహిళ పాత్ర చేయడం ఆనందంగా ఉందని చెప్పింది. దీనిపై స్పందించిన దిల్‌జిత్… ఇందిరగా కంగన నటిస్తే తాను ఆమె బాడీగార్డ్‌ పాత్రలో నటిస్తానని కామెంట్ చేశాడు. ఇందిరా గాంధీని బాడీగార్డ్ మర్డర్ చేసిన విషయం తెలిసిందే. మొత్తానికి కంగనను చంపేంత కసితో ఉన్నాడు దిల్ జిత్ అని నెట్టింట్లో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News