అలర్ట్: పాకాల అడవుల్లో పెద్దపులి సంచారం

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది. పాకాల అభయారణ్యంలోని సంగెం కాలువ పక్కన వాహనదారులకు పులి కనిపించింది. పులిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా సంభ్రమంలో ఉండగానే పులి అడివిలోకి పరిగెత్తింది. దీంతో భయాందోళనకు గురైన వాహనదారులు కూడా అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే, ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యం ఒకప్పుడు వన్యప్రాణులకి సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ అభయారణ్యం ఖానాపూర్, గూడూరు, కొత్తగూడ, మహబూబాబాద్ వరకు వ్యాపించి […]

Update: 2021-11-29 11:21 GMT

దిశ, ఖానాపూర్: వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం పాకాల అడవిలో పులి సంచారం కలకలం రేపుతోంది. పాకాల అభయారణ్యంలోని సంగెం కాలువ పక్కన వాహనదారులకు పులి కనిపించింది. పులిని చూసిన వాహనదారులు ఒక్కసారిగా సంభ్రమంలో ఉండగానే పులి అడివిలోకి పరిగెత్తింది. దీంతో భయాందోళనకు గురైన వాహనదారులు కూడా అక్కడినుంచి పరుగులు తీశారు. అయితే, ఖానాపూర్ మండలం పాకాల అభయారణ్యం ఒకప్పుడు వన్యప్రాణులకి సంరక్షణ కేంద్రంగా ఉండేది. ఈ అభయారణ్యం ఖానాపూర్, గూడూరు, కొత్తగూడ, మహబూబాబాద్ వరకు వ్యాపించి ఉంది. ఇక్కడ జింకలు, దుప్పులు, కొండ గొర్రెలు తమ సంతతిని పెంచుకున్నాయి.

దీంతో పెద్దపులి ఆహారాన్వేషణలో భాగంగానే రోడ్డుమీదకు వచ్చిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మొన్న కొత్తగూడ అడవుల్లో కనిపించిన పెద్దపులి ఇప్పుడు పాకాల ఆడివిలో ప్రత్యేక్షమైంది. దీంతో అడవిలో తిరిగే ప్రజలు, ముఖ్యంగా పశువులను మేపడం కోసం అడివికి వచ్చేవారు, గొర్ల కాపరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని ఫారెస్ట్ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం కొత్తగూడ మండలానికి చెందిన ఓ ఎంపీటీసీ భర్తపై ఇదే పులి దాడికి యత్నం చేసిందని పలువురు చర్చించుకుంటున్నారు.

పులి వచ్చినట్లు సమాచారం ఉంది: ఎఫ్ఆర్ఓ రమేష్

పులి వచ్చినట్లు వాహనదారుల నుండి సమాచారం ఉంది. కానీ, పులి అడుగులు గుర్తుల కోసం వెతుకుతున్నాం. గుర్తులు దొరికితే అది ప్రయాణించిన మార్గం సులువుగా తెలుస్తోంది. పెద్దపులి సంచరించే ప్రదేశాన్ని గుర్తించి ప్రజల్ని అప్రమత్తం చేస్తాం. అప్పటివరకు అడివిలోకి పశు, గొర్ల కాపరులు వెళ్లకపోవడమే మంచిది. పులి సంచారం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

Tags:    

Similar News