టిక్‌టాక్‌ను మేం కొనుక్కుంటం: వాల్‌మార్ట్!

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను భారత్‌లో నిషేధించిన తర్వాత దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అనేక ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇటీవల అమెరికాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు మైక్రోసాఫ్ట్‌తో చర్చలు కూడా జరుపుతోంది. ఇదే బాటలో మరో టెక్ కంపెనీ ఒరాకిల్ కూడా కొనేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా రిటైల్ దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్ కూడా టిక్‌టాక్‌ను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రధానంగా అడ్వర్టైజ్ బిజినెస్‌ను విస్తరించడానికి ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని వాల్‌మార్ట్ భావిస్తోంది. మైక్రోసాఫ్ట్‌తో […]

Update: 2020-08-28 04:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్‌ను భారత్‌లో నిషేధించిన తర్వాత దాని మాతృసంస్థ బైట్‌డ్యాన్స్ అనేక ప్రయత్నాలను మొదలుపెట్టింది. ఇటీవల అమెరికాలోని తన కార్యకలాపాలను విక్రయించేందుకు మైక్రోసాఫ్ట్‌తో చర్చలు కూడా జరుపుతోంది. ఇదే బాటలో మరో టెక్ కంపెనీ ఒరాకిల్ కూడా కొనేందుకు సిద్ధంగా ఉంది. తాజాగా రిటైల్ దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్ కూడా టిక్‌టాక్‌ను కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించింది. ప్రధానంగా అడ్వర్టైజ్ బిజినెస్‌ను విస్తరించడానికి ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని వాల్‌మార్ట్ భావిస్తోంది.

మైక్రోసాఫ్ట్‌తో కలిసి టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను కొనుగోలు చేయనున్నట్టు వాల్‌మార్ట్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే వాల్‌మార్ట్, మైక్రోసాఫ్ట్ సంస్థలు వ్యాపార భాగస్వామ్యం కలిగి ఉన్నాయి. వాల్‌మార్ట్ రిటైల్ స్టోర్స్, ఆన్‌లైన్ షాపింగ్ కోసం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను ఉపయోగిస్తోంది. ఈ భాగస్వామ్యం 2018లో జరిగింది. అప్పటినుంచి అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు పోటీ ఇస్తున్నాయి. ఇక టిక్‌టాక్ కొనుగోలుతో మరింత విస్తరించాలని వాల్‌మార్ట్ భావిస్తోంది. అయితే, టిక్‌టాక్ సీఈవో కెవిన్ మేయర్ రాజీనామా చేసిన తక్కువ వ్యవధిలో వాల్‌మార్ట్ ఈ ప్రకటన చేయడం మార్కెట్ వర్గాల్లో సంచలనంగా మారింది. కాగా, దేశ భద్రత నేపథ్యంలో ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టిక్‌టాక్‌కు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చారు. ఆలోపు టిక్‌టాక్ అమెరికా కార్యకలాపాలను అమెరికాకే చెందిన కంపెనీకి విక్రయించాలి లేదంటే, కంపెనీ కార్యకలాపాలను మూసేయాలని ట్రంప్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో భద్రతాపరమైన ఆరోపణలను పరిష్కరించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు బైట్‌డ్యాన్స్ ఛైర్మన్ జాంగ్ యమింగ్ తెలిపారు.

Tags:    

Similar News