వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ రూ. 46 కోట్ల విరాళం!

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19ను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి మద్దతుగా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)ను, అవసరమైన సామాగ్రిని చిన్న చిన్న వ్యాపారులకు, రైతులకు అందించేందుకు రూ. 38.3 కోట్లను విరాళంగా ఇవ్వనున్నాయి. దీంతోపాటు బలహీన వర్గాలకు శ్రీజన్, గూంజ్ స్వచ్చంద సంస్థలకు రూ. 7.7 కోట్లను అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపాయి. ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జీవో) పబ్లిక్ హెల్త్‌కేర్ కార్మికులకు పంపిణీ చేసేందుకు ఎన్95 మాస్కులు, మెడికల్ గౌన్ల వంటి పీపీలను అందించేందుకు రెండు […]

Update: 2020-04-18 09:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19ను అడ్డుకునేందుకు ప్రభుత్వానికి మద్దతుగా వాల్‌మార్ట్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆరోగ్య కార్యకర్తల కోసం వ్యక్తిగత రక్షణ పరికరాల(పీపీఈ)ను, అవసరమైన సామాగ్రిని చిన్న చిన్న వ్యాపారులకు, రైతులకు అందించేందుకు రూ. 38.3 కోట్లను విరాళంగా ఇవ్వనున్నాయి. దీంతోపాటు బలహీన వర్గాలకు శ్రీజన్, గూంజ్ స్వచ్చంద సంస్థలకు రూ. 7.7 కోట్లను అదనంగా ఇవ్వనున్నట్టు తెలిపాయి. ప్రభుత్వేతర సంస్థలు(ఎన్‌జీవో) పబ్లిక్ హెల్త్‌కేర్ కార్మికులకు పంపిణీ చేసేందుకు ఎన్95 మాస్కులు, మెడికల్ గౌన్ల వంటి పీపీలను అందించేందుకు రెండు సంస్థలు సంయుక్తంగా పనిచేయనున్నట్టు ప్రకటించాయి.

ఇంతకుముందు 3 లక్షల మాస్కులు, 10 లక్షల మెడికల్ గౌన్లు అందించామని, రైతులకు, గ్రామీణ సూక్ష్మ వ్యాపారులకు కొత్త నిధులతో మందులు, ఆహారం, పరిశుభ్రతకు అవసరమైన వస్తువులను పంపిణీ చేస్తామని సంస్థలు వెల్లడించాయి. ఇండియాలో కరోనా తీవ్రతను గుర్తించి ప్రజలకు తమ మద్దతు ఉంటామని వాల్‌మార్ట్ అధ్యక్షుడు కాథ్‌లిన్ చెప్పారు. కొవిడ్-19 సంక్షోభంలో బాధితులకు అండగా తమ బృందాలు 24 గంటలు కృషి చేస్తున్నాయని, ఇండియాలోని ప్రైవేట్, ప్రభుత్వ రంగాలతో కలిసి పనిచేస్తున్నామని ఫ్లిప్‌కార్ట్ సీఈవో కళ్యాణ్ తెలిపారు.

Tags: Coronavirus, E- Commerce Industry, Flipkart, Health, India, Walmart, Walmart Foundation

Tags:    

Similar News