ధోనీ ఫిట్‌నెస్ అద్భుతంగా ఉంది : వీవీఎస్
కరోనా కష్టకాలంలో క్రీడలన్నీ రద్దయిన వేళ.. ఇప్పటికీ ఓ చర్చ సజీవంగానే ఉంది. ప్రతీ రోజు ఎవరో ఒకరు దానిపై చర్చిస్తూనే ఉన్నారు. అదే ‘ధోనీ రిటైర్మెంట్’ టాపిక్. గతేడాది వరల్డ్ కప్ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ ద్వారా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని భావించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఇక ధోనీ రిటైర్మెంట్ ఖాయమేనని.. […]
కరోనా కష్టకాలంలో క్రీడలన్నీ రద్దయిన వేళ.. ఇప్పటికీ ఓ చర్చ సజీవంగానే ఉంది. ప్రతీ రోజు ఎవరో ఒకరు దానిపై చర్చిస్తూనే ఉన్నారు. అదే ‘ధోనీ రిటైర్మెంట్’ టాపిక్. గతేడాది వరల్డ్ కప్ తర్వాత ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడని మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.. ఐపీఎల్ ద్వారా తన పునరాగమనాన్ని ఘనంగా చాటాలని భావించాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఐపీఎల్ నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. దీంతో ఇక ధోనీ రిటైర్మెంట్ ఖాయమేనని.. ప్రపంచ కప్‌లో కివీస్‌తో ఆడిన సెమీ ఫైనలే అతడి చివరి మ్యాచ్ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో లెజండరీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
‘ధోనీ మానసికంగా, శారీరకంగా చాలా దృఢంగా ఉన్నాడని.. మరో మూడేళ్ల పాటు క్రికెట్ ఆడే శక్తి అతనిలో ఉందని’ చెప్పాడు. ‘వయసనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ధోనీని తప్ప వేరే నాయకుడిని ఊహించుకోలేమని’ వీవీఎస్ తెలిపాడు. ఐపీఎల్‌లో రాణించడం ద్వారా జట్టులోకి వచ్చే అవకాశాలున్నాయని, కాకపోతే ధోనీ భవిష్యత్‌ను నిర్ణయించేది మాత్రం బీసీసీఐ కొత్త సెలెక్షన్ కమిటీనేనని అభిప్రాయపడ్డాడు. వీవీఎస్ వ్యాఖ్యలతో ధోనీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘తలైవా ధోనీ’ తిరిగి భారత జట్టులోకి పునరాగమనం చేస్తాడని ధీమాగా ఉన్నారు.
Tags : MS Dhoni, VVS Laxman, IPL, Present Form, Fitness