WTC FINAL: రోహిత్ శర్మకు లక్ష్మణ్ టిప్స్

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ దగ్గరపడుతుండటంతో మాజీ క్రికెటర్లు టీమ్ ఇండియాకు సలహాలు ఇస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కొన్ని సూచనలు చేశాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎదుర్కునే సమయంలో ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించాలని చెప్పాడు. కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాకుండా టీమ్ ఇండియా క్రికెటర్లు ఆఫ్ స్టంప్ చూసుకొని ఆడకపోతే బౌల్ట్ నేరుగా వికెట్లను నేలరాల్చే అవకాశం ఉందన్నాడు. రోహిత్ చాలా క్రమశిక్షణతో […]

Update: 2021-06-15 10:31 GMT

దిశ, స్పోర్ట్స్: డబ్ల్యూటీసీ ఫైనల్ దగ్గరపడుతుండటంతో మాజీ క్రికెటర్లు టీమ్ ఇండియాకు సలహాలు ఇస్తున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మకు మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కొన్ని సూచనలు చేశాడు. కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను ఎదుర్కునే సమయంలో ఆఫ్ స్టంప్ ఎక్కడ ఉందో జాగ్రత్తగా గమనించాలని చెప్పాడు. కేవలం రోహిత్ శర్మ మాత్రమే కాకుండా టీమ్ ఇండియా క్రికెటర్లు ఆఫ్ స్టంప్ చూసుకొని ఆడకపోతే బౌల్ట్ నేరుగా వికెట్లను నేలరాల్చే అవకాశం ఉందన్నాడు.

రోహిత్ చాలా క్రమశిక్షణతో ఆడతాడని అందరికీ తెలుసు. గతంలో సౌతాఫ్రికా జట్టుతో కూడా చాలా చక్కని బ్యాటింగ్ చేశాడు. అదే ఇప్పుడు సౌతాంప్టన్‌లో పునరావృతం చేయాలని కోరుకుంటున్నాను. ముంబై ఇండియన్స్ జట్టుతో రోహిత్, బౌల్ట్ ఇద్దరూ సభ్యులే. ఒకరి బలహీనతలు మరొకరి తెలుసు. కాబట్టి వీరిద్దరి మధ్య పోరు ఆసక్తికరంగా సాగే అవకాశాలు ఉన్నాయని లక్ష్మణ్ అన్నాడు. ఆఫ్ స్టంప్ అవతలకు పడే బంతులను సాధ్యమైనంత వరకు వదిలేయడమే మంచిదని లక్ష్మణ్ చెప్పాడు.

Tags:    

Similar News