స్టీల్‌ప్లాంట్‌లో వీఆర్‌ఎస్‌ గుబులు…!

దిశ, విశాఖపట్నం: ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి… “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను సాగనంపే ప్రయత్నం చాపకింద నీరులా సాగుతోంది. ప్రైవేట్‌ కంపెనీ (పోస్కో)కి వేలాది ఎకరాలు కట్టబెట్టేందుకు కే్ంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోర్డు అధికారులు తాజాగా ‘వాలంటరీ రిటరైమెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌)ను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో విశాఖ స్టీల్‌ అధికారులు అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ, కార్మికవర్గాల్లో తీవ్ర చిచ్చురేపుతోంది. పొమ్మనలేక పొగబెట్టినట్టు ఇప్పటికే సంస్థలో […]

Update: 2020-11-08 20:05 GMT

దిశ, విశాఖపట్నం: ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి… “విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు” అనే నినాదంతో ఏర్పాటైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికులను సాగనంపే ప్రయత్నం చాపకింద నీరులా సాగుతోంది. ప్రైవేట్‌ కంపెనీ (పోస్కో)కి వేలాది ఎకరాలు కట్టబెట్టేందుకు కే్ంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బోర్డు అధికారులు తాజాగా ‘వాలంటరీ రిటరైమెంట్‌ స్కీమ్‌ (వీఆర్‌ఎస్‌)ను తెరపైకి తీసుకువచ్చారు. దీంతో విశాఖ స్టీల్‌ అధికారులు అనాలోచితంగా తీసుకున్న ఈ నిర్ణయం ఉద్యోగ, కార్మికవర్గాల్లో తీవ్ర చిచ్చురేపుతోంది. పొమ్మనలేక పొగబెట్టినట్టు ఇప్పటికే సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను అంతర్గత బదిలీలు, ఇతర ప్రాంతాలకు, విభాగాలకు పంపిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ ఉన్నతాధికారులు వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటన జారీ చేయడం విశేషం.

స్టీల్‌ప్లాంట్‌ నేపథ్యమిదీ…

విశాఖ అంటేనే స్టీల్‌ప్లాంట్‌ గుర్తుకు వస్తుంది. విశాఖ స్టీల్‌ స్థాపనతోనే విశాఖ నగర కీర్తి నలుదిక్కుల వ్యాపించింది. 32 బలిదానంతో 16వేల రైతుల భూములను ప్లాంట్‌కి ఇచ్చి, తమ పిల్లల భవిష్యత్‌కు స్టీల్‌ప్లాంట్‌ భరోసాగా ఉంటుందని నిర్మించుకున్న స్టీల్‌ పరిశ్రమ మునుగడ నేటికి ప్రశ్నార్థకంగా మారింది. ప్లాంట్‌ను మరింత విస్తరిస్తే మరెంత మందికో ఉపాధి, ఉద్యగ అవకాశాలు లభిస్తాయని ఆశపడుతున్న నిరుద్యోగ యువతకు కేంద్ర ప్రభుత్వం నిరాశ మిగిలిచేలా ప్లాంట్‌ను ప్రైవేటీకరణకు పూనుకుంటుంది, దీనిలో భాగంగానే సౌత్‌ కొరయన్‌ దేశానికి చెందిన పోస్కో కంపెనీకి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ధారదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటుందని కార్మిక సంఘాల నేతలు మండిపడుతున్నారు. విశాఖలో రూ.30వేలకోట్లతో స్టీల్‌ యూనిట్‌ నెలకొల్పోందుకు పోస్కో కంపెనీ తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే ఒడిషాలో నెలకోల్పేందుకు ప్రయత్నాలు చేసినప్పటికి స్థానిక ప్రజలు అడ్డుకోవడంతో ఆరేళ్ల పాటు ఉద్యమం చేయడంతో పోస్కో కళ్లు విశాఖ స్టీల్‌పై పడ్డాయి.

2018లోనే పోస్కోతో చర్చలు…

2018ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీతో కలసి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను పోస్కో కంపెనీ ప్రతినిధులు సందర్శించారు. దీనికి ముందుగా ప్రధాని సౌత్‌కొరియా పర్యటనలోనే ఒప్పందాలు జరిగినట్లు తెలుస్తోంది. పోస్కో కంపెనీ స్టీల్‌ యూనిట్‌ ఏర్పాటుకు 3,500 ఎకరాలు అవసరమని ప్రతినిధులు మోడీకి తెలపడంతో ఆ మేరకు రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆర్గానిక్‌ ఆటోమోటివ్‌ లాంగ్‌ ప్రోడెక్ట్‌(నాన్‌ పొల్యూటుడ్‌) స్టీల్‌ ఉత్పత్తిలు తయారు చేయనున్నారు. లాభాలు గడిస్తూ, లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూన్న స్టీల్‌ పరిశ్రమను పోస్కో కాజేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

రెండ నెలల క్రితమే వెబ్‌నార్‌ ద్వారా ఒప్పందం…

విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పోస్కో కంపెనీ తమ లవాదేవీలను, ఉత్పత్తి చేసుకునేందుకు స్టీల్‌ అధికారులతో రెండు నెలల క్రితమే వెబ్ నార్‌ ద్వారా ఒప్పందం చేసుకున్నారు. దీనిలో భాగంగానే తొలి విడతలో 750 ఎకరాలు అవసరమని సంస్థ ప్రతినిధులు చెప్పడంతో దీనిని ఇచ్చేందుకు స్టీల్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు. వాస్తవానికి లాభాల బాటలో ఉన్న విశాఖ స్టీల్‌ను విస్తరణ చేసి మరింత అభివృద్ధి పరిస్తే భవిష్యత్‌ తరాల వారికి ఎంతో ఉపయోగకరంగా ఉండేది. కానీ కేంద్ర ప్రభుత్వమే వేలాది ఎకరాల భూములను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడండంతో విస్తరణ సైతం జరిగే అవకాశం లేకుండా పోతుంది. వాస్తవానికి 20 మిలియన్ల స్టీల్‌ ఉత్పతి చేసేందకు విశాఖ స్టీల్‌కు అవకాశం, వనరులు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఏడు మిలియన్లు మాత్రమే స్టీల్‌ ఉత్పత్తి అవుతుందని అధికారులు చెబుతున్నారు.

వీఆర్‌ఎస్‌ నిబంధనలు ఇవే…

45ఏళ్ల వయస్సు, 15 ఏళ్ల సర్వీస్‌ ఉన్నవారెవరైనా వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోవచ్చుంటూ స్టీల్‌ప్లాంట్‌ ఈడీ వై.బాలజీ ఒక ప్రకటన చేశారు. అలాగే ఏడాదికి 30రోజుల చొప్పున, మిగిలిన సర్వీసుకు బేసిక్‌ప్లస్‌ డీఏ ఇచ్చేలా, మరో పద్దతిలో కేవలం ఏడాదికి 45 రోజుల చొప్పున, మిగిలిన సర్వీసును లెక్కచేయకుండా వీఆర్‌ఎస్‌ అమలు చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో ఈ విధానంపై ఉద్యోగ, కార్మికులు, సంఘాల నాయకులు తప్పుపడుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగుల్లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ విభాగం కింద పూర్‌గ్రేడ్‌ బీ,సీ గ్రేడులంటూ యాజమాన్యం గందరగోళానికి గురిచేయడం విశేషం. ఇదే ప్రకటనలో ప్రత్యేక విద్యాఅర్హత కలిగిన విద్యార్థలు, స్పెషలిస్ట్‌ వైద్యులు, బాయిలర్ల ఆపరేటర్లు, మైనింగ్‌ ఇంజనీర్లు,జాతీయ పురస్కరాలు అందుకున్నవారు, విదేశాల్లో శిక్షణ పొందిన వారు అనర్హలుగా పేర్కొనడం మరో విశేషం.

ప్రైవేట్‌కు అప్పగింతతో పొంచి ఉన్న ప్రమాదం…

డాక్టర్‌ బూసి వెంకటరావు,విశాఖ స్టీల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఉపాధ్యక్షడు స్పందిస్తూ…. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ వ్యక్తుల చేతిలోకి వెళ్తే ఉద్యోగ, కార్మికులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని కార్మిక సంఘం నాయకలు డిమాండ్‌ చేస్తున్నారు. లాభాల బాటలో ఉన్న స్టీల్‌ప్లాంట్‌ను భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వమే విస్తరణ, అభివృద్ధి చేపట్టడంతో ఎంతో మేలు జరుగుతుందని, ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించడం ద్వారా ఉన్నతాధికారలను లొంగదీసుకుని మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసే అవకాశం ఉందన్నారు. అలాగే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం కోల్పోతామన్నారు.

డాక్టర్‌ బూసి వెంకటరావు
Tags:    

Similar News