ఓటర్ జాబితా సవరణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్
దిశ, మహబూబ్‌నగర్: ‘ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్’ను ఎన్నికల అధికారులు, ఓటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడినట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లు, ప్రజలు.. తప్పనిసరిగా ‘ఓటరు హెల్ప్‌లైన్ […]
దిశ, మహబూబ్‌నగర్: ‘ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్’ను ఎన్నికల అధికారులు, ఓటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వెలువడినట్లు ఆయన ప్రకటనలో వెల్లడించారు. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా.. కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఓటర్లు, ప్రజలు.. తప్పనిసరిగా ‘ఓటరు హెల్ప్‌లైన్ మొబైల్ యాప్’ను డౌన్లోడ్ చేసుకునేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఈసీ ఆదేశించినట్టు చెప్పారు. ఇక అధికారులు కూడా సాధ్యమైనంత వరకు ఈ యాప్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కలెక్టర్ వెంకటరావు సూచించారు.