గ్రాడ్యుయేట్లు ఓటేయడం మరువద్దు : టీజీఓ
దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) విజ్ఞప్తి చేసింది. శనివారం టీజీఓ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన పౌరహక్కు ఓటుహక్కు అని, ఇప్పుడు ఓటేసి ప్రాతినిధ్యం వహించే నేతను ఎన్నుకోవాలని సూచించారు. మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకుని, దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామన్నారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో : మండలి ఎన్నికల్లో పట్టభద్రులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు వేయడం ప్రాథమిక బాధ్యత అని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) విజ్ఞప్తి చేసింది. శనివారం టీజీఓ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
టీజీఓ ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన పౌరహక్కు ఓటుహక్కు అని, ఇప్పుడు ఓటేసి ప్రాతినిధ్యం వహించే నేతను ఎన్నుకోవాలని సూచించారు. మండలి ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్ ఓటు హక్కును వినియోగించుకుని, దేశ ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామన్నారు. టీజీఓ ప్రతినిధులు రవీందర్‌రావు, డా.గండూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్‌గౌడ్ పాల్గొన్నారు.