ఓటుకు నోటు కేసు.. రేవంత్‌రెడ్డికి ఊరట
దిశ, తెలంగాణ బ్యూరో : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన మరుసటి రోజునే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను నిలిపివేయాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించి ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను చేపట్టవద్దని తెలంగాణ అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. నాలుగు […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చార్జిషీటు దాఖలు చేసిన మరుసటి రోజునే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను నిలిపివేయాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంతలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారించి ఈ కేసులో విచారణ పూర్తయ్యేంత వరకు సాక్షుల క్రాస్ ఎగ్జామినేషన్‌ను చేపట్టవద్దని తెలంగాణ అవినీతి నిరోధక శాఖను ఆదేశించింది. నాలుగు వారాల్లో సమాధానం ఇవ్వాలని గడువు విధించి విచారణను వాయిదా వేసింది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యేలకు రూ. 50 లక్షలు ఇస్తూ పట్టుబడినట్లు ఏసీబీ చార్జిషీటును ఆధారం చేసుకుని వీడియో ఫుటేజీ సహా మరికొన్నింటిని పరిగణనలోకి తీసుకుని నాంపల్లి కోర్టులో ఈడీ గురువారం ఛార్జిషీటును దాఖలు చేసింది. మనీ లాండరింగ్ చట్టం కింద అభియోగాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొని ప్రస్తుత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఉదయ సింహ, సెబాస్టియన్, జెరూసలేం మత్తయ్య, వేం నరేందర్ రెడ్డి కుమారుడు తదితరులను ఆ చార్జిషీటులో నిందితులుగా పేర్కొన్నది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో రేవంత్ రెడ్డితో పాటు వీరందరికీ ఊరట లభించినట్లయింది.