5జీ ట్రయల్స్‌లో 4జీబీపీఎస్ వేగాన్ని సాధించిన వొడాఫోన్ ఐడియా..
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు జరుగుతున్న పరీక్షల్లో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త రికార్డును సాధించింది. శుక్రవారం జరిపిన 5జీ టెక్నాలజీ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియా 4జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో విక్రయానికి ఉంచనున్న 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌పై జరిగిన ప్రయోగాల్లో ఈ వేగం నమోదు చేసుకున్నట్టు వొడాఫోన్ ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అన్నారు. నోకియాతో పాటు ఎరిక్సన్ కంపెనీలతో రెండు వేర్వేరు […]
దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా 5జీ సేవలను అందించేందుకు జరుగుతున్న పరీక్షల్లో ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా కొత్త రికార్డును సాధించింది. శుక్రవారం జరిపిన 5జీ టెక్నాలజీ ట్రయల్స్‌లో వొడాఫోన్ ఐడియా 4జీబీపీఎస్ వేగాన్ని అందుకున్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో విక్రయానికి ఉంచనున్న 26 గిగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్‌పై జరిగిన ప్రయోగాల్లో ఈ వేగం నమోదు చేసుకున్నట్టు వొడాఫోన్ ఇండియా లిమిటెడ్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జగ్బీర్ సింగ్ అన్నారు.
నోకియాతో పాటు ఎరిక్సన్ కంపెనీలతో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఈ 5జీ ప్రయోగాలు ఇంకా కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కేంద్రం 5జీ ట్రయల్స్ గడువును పొడిగించిందని, 2022 మే వరకు 5జీ ట్రయల్స్ కొనసాగుతాయని జగ్బీర్ తెలిపారు. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ఖచ్చితమైన తేదీలపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదని వొడాఫోన్ ఐడియా చీఫ్ రెగ్యులేటరీ అండ్ కార్పొరేటర్ ఆఫీసర్ బాలాజీ వెల్లడించారు.