వైజాగ్ వాటర్ డీ-శాలినేషన్ సెంటర్ కాబోతోందా?
సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్టణం నీటి కొరతను అధిగమించనుందా? ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పరిశ్రమలకు సముద్రపు నీటిని వినియోగించనున్నారా? మంచినీరు వృధా చేయకుండా..సముద్రపు నీటిని వినియోగించే సరికొత్త పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందా?… భారతదేశంలోని తొలి డీ-శాలినేషన్ సెంటర్‌గా వైజాగ్ రూపొందనుందా? అంటే అవుననే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఇంతకీ ఈ డీ-శాలినేషన్ అంటే ఏంటి?.. సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేయడమే డీ-శాలినేషన్. సముద్రం అడుగున నీటి ఒరవడి లేని […]
సిటీ ఆఫ్ డెస్టినీగా పేరొందిన విశాఖపట్టణం నీటి కొరతను అధిగమించనుందా? ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పరిశ్రమలకు సముద్రపు నీటిని వినియోగించనున్నారా? మంచినీరు వృధా చేయకుండా..సముద్రపు నీటిని వినియోగించే సరికొత్త పారిశ్రామిక విధానానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందా?… భారతదేశంలోని తొలి డీ-శాలినేషన్ సెంటర్‌గా వైజాగ్ రూపొందనుందా? అంటే అవుననే రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.
ఇంతకీ ఈ డీ-శాలినేషన్ అంటే ఏంటి?.. సముద్రపు నీటి నుంచి ఉప్పును వేరు చేయడమే డీ-శాలినేషన్. సముద్రం అడుగున నీటి ఒరవడి లేని ప్రదేశంలో పైప్‌లైన్ ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నీటిని అత్యధిక సామర్థ్యం కలిగిన పంపుల ద్వారా నీటిని తోడుతారు. అలా తోడిన నీటిని భూ ఉపరితలంపై ఏర్పాటు చేసే పెద్ద ట్యాంకులలో నింపుతారు. ఈ ట్యాంకుల్లో మట్టి, రాళ్లు, గులకరాళ్లు, చిట్టి సున్నపురాళ్లు, నదీతీరాల్లో దొరికే బండ ఇసుక, సున్నితమైన ఇసుక, రాళ్లు వంటి పొరలు ఏర్పాటు చేస్తారు.
ఈ పొరల ద్వారా వేగంగా వచ్చే నీరు ఆ ట్యాంకుల్లో చేరుతుంది. ఈ క్రమంలో నీరు కొంత శుభ్రమవుతుంది. ట్యాంకుల్లో చేరిన తరువాత మరికొన్ని పొరల ద్వారా ఆ నీరు మరికొంత శుధ్దీకరించబడుతుంది. అక్కడి నుంచి మరింత వేగవంతమైన సామర్థ్యం గల పంపులతో నీటిని పంపింగ్ చేస్తారు. ఇక్కడ ఆ సముద్రపు నీరు మరింత శుద్ధీకరించబడుతుంది. దానిని శుద్ధీకరించే ఫిల్టర్ల ద్వారా మరో ట్యాంకులోకి తోడుతారు. అక్కడి నుంచి మరోసారి శుద్ధి చేసి సరఫరా చేస్తారు. ఈ ప్రక్రియను డీ-శాలినేషన్ అంటారు.
ఈ టెక్నాలజీ ప్రస్తుతం ఇజ్రాయెల్ వినియోగిస్తోంది. ఎడారి దేశమైన ఇజ్రాయెల్‌లో నీటి వనరులు చాలా తక్కువ. గలీలయ సముద్ర తీర ప్రాంతంలో మాత్రమే కాస్తో కూస్తో నీరు దొరుకుతుంది. అక్కడ కూడా వర్షపు నీటిని ఒడిసి పట్టుకుని వినియోగించుకోవడమే సంప్రదాయంగా మారింది. ఈ నేపథ్యంలో డీ-శాలినేషన్ ప్రక్రియ ద్వారా నీటిని వినియోగించి ఒక శాస్త్రవేత్త తన వ్యవసాయ భూమిని సస్యశ్యామలం చేశాడు. దీంతో ఆ పరిజ్ఞానాన్ని దేశవ్యాప్తం చేశాడు. ఆదేశంలో ప్రధాన సముద్రమైన మెరిడియన్ సముద్ర ప్రాంతంలో నీటి శుద్ధి కర్మాగారాలను ఇజ్రాయెల్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఆ నీటిని సరఫరా చేస్తోంది. దీంతో ఆ ఎడారి దేశం మంచి నీటి కొరతను అధిగమించింది.
అలా సరఫరా చేసిన నీటిని డ్రిప్ ఇరిగేషన్ విధానంలో వినియోగించుకుంటూ వ్యవసాయం చేస్తూ లాభాలార్జిస్తోంది. రుగాండా, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాలతో పాటు.. మధ్య ఆసియా దేశాల్లోని శరణార్థి శిబిరాలకు కూడా ఇజ్రాయెల్ ఈ నీటినే సరఫరా చేస్తోంది. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఈ టెక్నాలజీని మరో 32 దేశాలకు పరిచయం చేసింది. ఈ పరిజ్ఞానం ద్వారానే ఆయా దేశాలు నీటి కొరతను అధిగమిస్తున్నాయి. పలు దేశాలు తాగునీటికి కూడా ఈ డీ-శాలినేషన్ ప్రక్రియ ద్వారా శుద్ధి చేయబడిన నీటినే వినియోగించడం విశేషం.
ఈ ప్రక్రియ ద్వారానే ఆంధ్రప్రదేశ్ నీటి కొరతను ఎదుర్కొనబోతోంది. ఈ విధానం ద్వారా శుద్ధి చేసిన నీటిని బంగాళాఖాతం తీరంలోని పారిశ్రామిక వాడలన్నింటికీ సరఫరా చేయనున్నారు. డీ-శాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు అనువైన స్థలం చూడడంతో పాటు దానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిశ్రమలకు డీ-శాలినేషన్ వాటర్ వినియోగించడం ద్వారా మంచినీటి కొరతను అధిగమించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇలా చేయడం ద్వారా పరిశ్రమలకు సరఫరా చేసే నీరు రిజర్వాయర్లలో ఉండడం వల్ల నీటి ఎద్దడి అన్నమాటే తలెత్తదని సీఎం అంచనావేస్తున్నారు.
వైజాగ్‌లో డీ-శాలినేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తే భారతదేశంలో తొట్టతొలి ఈ విధానం ద్వారా నీటిని ఉత్పత్తి చేసే తొలి రాష్ట్రంగా ఏపీ, పట్టణంగా విశాఖపట్టణం రికార్డులకెక్కుతాయి. అంతే కాకుండా ఈ విధానం ద్వారా శుద్ధి చేసిన నీరు అందుబాటులోకి వస్తే అత్యాధునిక పద్దతుల్లో వ్యవసాయ విధానాలు రూపొందించడం ద్వారా కూరగాయల కొరతను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.