కరోనా క్లినికల్ ట్రయల్స్‌కి వైజాగ్ కేజీహెచ్ ఎంపిక
దిశ ఏపీ బ్యూరో: యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనాకి మందు కనుగొనేందుకు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పరిశోధనల్లో అత్యంత కీలకమైనది క్లినికల్ ట్రయల్స్ పీరియడ్. ఇందుకోసం వైజాగ్ కేజీహెచ్‌ను కూడా ఐసీఎంఆర్ ఎంపిక చేసింది. దీనిపై కేజీహెచ్ వైద్య విభాగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచానికి మందునందించే క్లినికల్ ట్రయల్స్‌కి […]
దిశ ఏపీ బ్యూరో: యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కరోనాకి మందు కనుగొనేందుకు భారత్ బయోటెక్, ఐసీఎంఆర్ సంయుక్తంగా పరిశోధనలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఈ పరిశోధనల్లో అత్యంత కీలకమైనది క్లినికల్ ట్రయల్స్ పీరియడ్. ఇందుకోసం వైజాగ్ కేజీహెచ్‌ను కూడా ఐసీఎంఆర్ ఎంపిక చేసింది.
దీనిపై కేజీహెచ్ వైద్య విభాగం హర్షం వ్యక్తం చేస్తోంది. ప్రపంచానికి మందునందించే క్లినికల్ ట్రయల్స్‌కి ఎంపిక కావడమంటే.. పరోక్షంగా ప్రపంచానికి వెలుగు చూపడమేనని కేజీహెచ్ వైద్యులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ అర్జున్ మాట్లాడుతూ, నాలుగు రోజుల క్రితం ఐసీఎంఆర్ నుంచి లెటర్ వచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని క్లినికల్ ట్రయల్స్‌కి సంబంధించిన గైడ్ లైన్స్ గురించి అడిగామన్నారు. ప్రభుత్వం నుంచి గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే క్లినికల్ ట్రయల్స్ ప్రారంభిస్తామన్నారు. కరోనా క్లినికల్ ట్రయల్స్‌కు కేజీహెచ్ ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేజీహెచ్‌లో కోవిడ్ -19 వ్యాక్సిన్ టెస్టింగ్‌కు సంబంధించిన అన్ని సదుపాయాలతో పాటు, దీనికి ఒక కమిటీ కూడా ఉందని ఆయన తెలిపారు.