బాలీవుడ్ ఒక ‘ప్రత్యేకమైన క్లబ్’.. ఇక్కడ ప్రతిభ కన్నా అదే ముఖ్యం!
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ఇటీవల నటించిన సిరీస్ ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’. కాగా ఈ సిరీస్ థర్డ్ సీజన్ రిలీజ్‌కు సిద్ధం కాగా.. ప్రమోషన్‌లో పాల్గొన్న నటుడు.. బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీటౌన్ ఇప్పుడు ప్రత్యేకమైన క్లబ్‌గా మారిపోయిందని, ఇక్కడ ప్రతిభ కంటే ఇంటిపేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న వివేక్.. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపాడు. ‘సినిమా పరిశ్రమ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే వ్యవస్థను అభివృద్ధి […]
దిశ, సినిమా: బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ ఇటీవల నటించిన సిరీస్ ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’. కాగా ఈ సిరీస్ థర్డ్ సీజన్ రిలీజ్‌కు సిద్ధం కాగా.. ప్రమోషన్‌లో పాల్గొన్న నటుడు.. బాలీవుడ్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీటౌన్ ఇప్పుడు ప్రత్యేకమైన క్లబ్‌గా మారిపోయిందని, ఇక్కడ ప్రతిభ కంటే ఇంటిపేర్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న వివేక్.. న్యూ టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపాడు.
‘సినిమా పరిశ్రమ యంగ్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేకపోయింది. బీటౌన్‌ను ఒక ఎక్స్‌క్లూజివ్ క్లబ్‌గా మార్చేశారు. అందులోకి రావాలంటే ఇంటిపేరు గొప్పదై ఉండాలి లేదా ప్రముఖుల బ్యాగ్రౌండ్ అయినా ఉండాలి. లేదంటే తెలిసిన ఎవరో ఒకరి గ్రూప్‌లో చేరాలి. అలాంటి వారికి మాత్రమే ఇక్కడ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. ఎన్నో ఏళ్లుగా ఈ పరిశ్రమలో ఉన్న నాలాంటి వారికే ఇక్కడ చాలా కష్టంగా ఉంది.
నా వరకు వీలైనంతగా కొత్తవారిని ప్రోత్సహిస్తున్నాను’ అని చెప్పాడు. అలాగే ‘ఇన్‌సైడ్ ఎడ్జ్’ షో సమయంలో రిచా చద్దా పేరును తన పేరు కంటే ముందుగా హైలెట్ చేయమని ఎక్సెల్ నిర్మాతలను అభ్యర్థించినట్లు పేర్కొన్న నటుడు.. సినిమా సెట్ అనేది సరదాగా గడిపే సృజనాత్మక స్థలంగా ఉండాలని, ఇక్కడ ప్రతి ఒక్కరూ సమానమేనని తెలిపారు.