Nitish Reddy: టెస్టుల్లో ఎంట్రీ ఇవ్వనున్న తెలుగు తురుపుముక్క నితీశ్ రెడ్డి..?

టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్, తెలుగు తురుపుముక్క, విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి భారత్ తరపున టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

Update: 2024-11-18 05:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా యంగ్ ఆల్‌రౌండర్, తెలుగు తురుపుముక్క, విశాఖ కుర్రాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (Nitish Kumar Reddy) భారత్ తరపున టెస్టుల్లోకి అరంగేట్రం చేయబోతున్నాడా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అది కూడా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బోర్డర్‌- గవస్కర్‌ ట్రోఫీతోనే ఈ ఎంట్రీ ఉండబోతున్నట్లు సమాచారం. పెర్త్ వేదికగా శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా - భారత్ తొలి BGT టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో 21 ఏళ్ల నితీశ్‌ కూడా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి పిచ్‌ పేస్, బౌన్స్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉండటంతో టీంలో నాలుగో పేసర్‌గా నితీశ్‌ను జట్టులో ఆడించాలని మేనేజ్‌మెంట్‌ ఆలోచిస్తోందని టాక్. నితిశ్ బౌలింగ్‌కి ఈ పిచ్ కరెక్ట్‌గా సెట్ కావడంతో పాటు అతడు జట్టులోకి వస్తే బ్యాటింగ్ ఆర్డర్ కూడా బలంగా మారుతుంది.

గత నెల బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన నితీశ్‌.. ఆల్‌రౌండర్‌గా మంచి మార్కులే కొట్టేశాడు. రెండో టీ20లో 74 (34 బంతుల్లో) పరుగులు చేయడంతో పాటు రెండు వికెట్లూ పడగొట్టి పర్‌ఫెక్ట్ ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. దీంతో టీమిండియాలో ఎప్పటి నుంచో ఉన్న ఆల్‌రౌండర్ లోటును నితీశ్‌తో తీర్చాలని బీసీసీఐ అనుకుంటోందట. ఇప్పటికే హార్దిక్ ఉండగా.. అతడికి నితీశ్ కూడా తోడైతే టీమిండియాకి ఎదురుండదనేది బీసీసీఐ ప్లాన్‌గా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టెస్టుల్లోనూ నితీశ్‌ని ట్రై చేయాలని అనుకుంటున్న బీసీసీఐ.. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ కోసం తొలిసారి ఎంపిక చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా తుది జట్టులో కూడా స్థానం కల్పించబోతోందని సమాచారం.

ఇదిలా ఉంటే ఈ ఆంధ్ర ఆటగాడు ఇప్పటివరకూ 23 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 56 వికెట్లు పడగొట్టాడు. 779 పరుగులు చేశాడు. తాజాగా ఆస్ట్రేలియా జట్టుతో రెండు అనధికార టెస్టుల్లో భారత్‌-ఏ తరపున ఆడడం నితీశ్‌‌కి ఇక్కడ కలిసొచ్చే అంశంగా మారింది.


Similar News