డిమాండ్ క్రమంగా పుంజుకుంటోంది : విస్తారా
దిశ, వెబ్‌డెస్క్: స్థిరమైన డిమాండ్‌ను తిరిగి సాధిస్తున్న క్రమంలో ప్రముఖ విమానయాన (Airlines) సంస్థ విస్తారా (vistara)సెప్టెంబర్ చివరి నాటికి రోజూవారీ విమానాల సంఖ్యను 80 నుంచి 100కి పెంచనున్నట్టు సంస్థ సీఈవో లెస్లీ థింగ్ (leslie thng)తెలిపారు. దీంతో పాటు సంస్థలో ఎలాంటి ఉద్యోగుల తొలగింపు జరగలేదని సంస్థ సీఈవో వెల్లడించారు. కరోనా వల్ల దెబ్బతిన్న దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించిన పరిష్కారాల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు. దేశీయ విమాన ప్రయాణాలను తిరిగి […]
దిశ, వెబ్‌డెస్క్: స్థిరమైన డిమాండ్‌ను తిరిగి సాధిస్తున్న క్రమంలో ప్రముఖ విమానయాన (Airlines) సంస్థ విస్తారా (vistara)సెప్టెంబర్ చివరి నాటికి రోజూవారీ విమానాల సంఖ్యను 80 నుంచి 100కి పెంచనున్నట్టు సంస్థ సీఈవో లెస్లీ థింగ్ (leslie thng)తెలిపారు. దీంతో పాటు సంస్థలో ఎలాంటి ఉద్యోగుల తొలగింపు జరగలేదని సంస్థ సీఈవో వెల్లడించారు. కరోనా వల్ల దెబ్బతిన్న దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించిన పరిష్కారాల కోసం ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
దేశీయ విమాన ప్రయాణాలను తిరిగి ప్రారంభించిన మొదటి కొన్ని వారాల్లోనే డిమాండ్ (demand)పెరిగిందని చెప్పారు. కరోనా (corona) వ్యాప్తి వల్ల దేశీయంగా విమానయాన సేవలను మార్చి 25 నుంచి మే 24 వరకు నిలిపివేయగా, తర్వాత కూడా ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ (DGCV)ఆమోదించిన విమనాలను మాత్రమే నడుపుతున్నట్టు కంపెనీ పేర్కొంది. కరోనాకు ముందునాటి స్థాయికి దూరంగా ఉన్నప్పటికీ, స్థిరమైన వృద్ధి కనిపిస్తోందని లెస్లీ వెల్లడించారు.