ఆ ఫౌండేషన్‌కు.. విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డు
దిశ, పటాన్‌చెరు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత 45 రోజులుగా నిర్విరామంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరికీ సేవలందించడంలో బాలాజీ ఫౌండేషన్ ముందడుగు వేసింది. ఉత్తమ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఫౌండేషన్ చైర్మన్ బలరాంకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఎం.డి రాంబాబు అవార్డును మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ… […]
దిశ, పటాన్‌చెరు: కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఈ లాక్‌డౌన్ సమయంలో శ్రీ బాలాజీ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. గత 45 రోజులుగా నిర్విరామంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నటువంటి అందరికీ సేవలందించడంలో బాలాజీ ఫౌండేషన్ ముందడుగు వేసింది. ఉత్తమ సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ ఫౌండేషన్ చైర్మన్ బలరాంకు విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ ఎం.డి రాంబాబు అవార్డును మంగళవారం అందజేశారు.
ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ… మా సామాజిక సేవలను గుర్తించి విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ అవార్డుతో సత్కరించినందుకు ఎం.డి రాంబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తోటి సహచరులు, మిత్రులు కష్టపడిన దానికి రావడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. నేను పుట్టి పెరిగిన రామచంద్రాపురం పట్టణ ప్రజలకు, నాతోపాటు నడిచిన మిత్రులకు, చేయూతనిచ్చిన దాతలకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నానని తెలిపారు.