స్మార్ట్‌ సిటీ వరల్డ్‌ కాంగ్రెస్‌లో విశాఖకు గుర్తింపు

దిశ, విశాఖపట్నం: స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న సుందర విశాఖ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌-2020లో విశాఖ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. అయితే, దివ్యాంగుల పిల్లల కోసం విశాఖ బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కు వినూత్నంగా ఉండటంతో లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు కేటిగిరిలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సస్‌పుల్‌ ప్రాజెక్టుగా గుర్తింపు లభించింది. విశాఖ బీచ్‌రోడ్డులోని రూ.3.50 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేసిన సంగతి […]

Update: 2020-11-19 07:52 GMT

దిశ, విశాఖపట్నం: స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న సుందర విశాఖ నగరానికి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ స్మార్ట్ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌-2020లో విశాఖ ప్రపంచ నగరాలతో పోటీ పడింది. అయితే, దివ్యాంగుల పిల్లల కోసం విశాఖ బీచ్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పార్కు వినూత్నంగా ఉండటంతో లివింగ్‌ అండ్‌ ఇన్‌క్లూజన్‌ అవార్డు కేటిగిరిలో మోస్ట్‌ ఇన్నోవేటివ్‌ అండ్‌ సక్సస్‌పుల్‌ ప్రాజెక్టుగా గుర్తింపు లభించింది.

విశాఖ బీచ్‌రోడ్డులోని రూ.3.50 కోట్లతో ఈ పార్కును ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో రూపొందించిన తొలి ఎబిలిటి పార్కు ఇదే కావడం విశేషం. మొత్తం ఈ ఎక్స్‌పోలో ప్రపంచం నలుమూలల నుంచి 46 నగరాలు పాల్గొనగా.. భారత్‌ నుంచి కేవలం విశాఖపట్నం మాత్రమే అర్హత పొందడం విశేషం. మరో విషయం ఏమింటే ఈ పార్కు ఏర్పాటును చూసి యూకే, అమెరికన్ల అంబాసిడర్లు కూడా ప్రశంసించారు.

ఈ అవార్డు లభించడపై గ్రేటర్‌ కమిషనర్‌ సృజన గురువారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ అవార్డు కోసం ప్రపంచంలోని అతి పెద్ద ప్రముఖ నగరాలతో విశాఖ పోటీ పడటం గర్వంగా ఉంది. వచ్చే ఏడాది బార్సినాలో జరిగే స్మార్ట్‌ సిటీ ఎక్స్‌పో వరల్డ్‌ కాంగ్రెస్‌–2021లో విశాఖ ఒక కేటగిరీలో అయినా మొదటి స్థానంలో నిలిచి అంతర్జాతీయ అవార్డు సొంతం చేసుకునేలా ప్రయత్నం చేస్తామని, ఇదే స్పూర్తితో వచ్చే ఏడాది స్మార్ట్‌ సిటీ పోటీల్లో తొలి స్థానం సాధించేందుకు కృషి చేస్తామని అన్నారు.

Tags:    

Similar News