కరోనా బాధితుల పట్ల మానవత్వం చాటిన సెహ్వాగ్

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా.. కరోనా బారినపడి అనేకమంది మృతిచెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడి భోజన సదుపాయం లేక అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అలాంటి వారిని ఆదుకునేందుకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ముందుకొచ్చారు. ఇప్పటివరకూ ఢిల్లీలో దాదాపు […]

Update: 2021-05-15 22:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా భయంకరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనాను కట్టడి చేసేందుకు దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. అయినా.. కరోనా బారినపడి అనేకమంది మృతిచెందుతున్నారు. ఈ క్రమంలో కరోనా బారినపడి భోజన సదుపాయం లేక అనేకమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో అలాంటి వారిని ఆదుకునేందుకు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ ముందుకొచ్చారు. ఇప్పటివరకూ ఢిల్లీలో దాదాపు 51,000 వేల మందికి భోజనం పంపిణీ చేసి, మానవత్వం చాటుకున్నాడు. అంతేగాకుండా.. కరోనా బారినపడి ఆహారం కోసం ఇబ్బంది పడుతున్న వారు డైరెక్ట్‌గా తనకు ట్విట్టర్‌లో మెసేజ్ పెడితే తన ట్రస్ట్ ద్వారా ఫుడ్ పార్సల్ చేస్తామని భరోసా ఇచ్చారు.

Tags:    

Similar News