కోహ్లీ చెత్త రికార్డు
దిశ వెబ్‌డెస్క్: క్రికెట్‌లో చూసుకుంటే ప్రతీది రికార్డు అవుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా రికార్డుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అత్యధిక రన్స్, అత్యధిక స్కోర్, అత్యధిక వికెట్లు, అత్యధిక క్యాచ్‌లు.. ఇలా ప్రతీది రికార్డే.. ‘కోహ్లీ రికార్డు సృష్టించాడు.. దానిని రోహిత్ రికార్డు బ్రేక్ చేశాడు’ లాంటి వార్తలు మనం ఎప్పుడూ వింటూ వింటాం. అయితే ఇటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక చెత్త […]
దిశ వెబ్‌డెస్క్: క్రికెట్‌లో చూసుకుంటే ప్రతీది రికార్డు అవుతూ ఉంటుంది. ప్రతి చిన్న విషయాన్ని కూడా రికార్డుగా పరిగణలోకి తీసుకుంటూ ఉంటారు. అత్యధిక రన్స్, అత్యధిక స్కోర్, అత్యధిక వికెట్లు, అత్యధిక క్యాచ్‌లు.. ఇలా ప్రతీది రికార్డే.. ‘కోహ్లీ రికార్డు సృష్టించాడు.. దానిని రోహిత్ రికార్డు బ్రేక్ చేశాడు’ లాంటి వార్తలు మనం ఎప్పుడూ వింటూ వింటాం.
అయితే ఇటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎన్నో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక చెత్త రికార్డును కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. అది ఏంటంటే.. టీమిండియా కెప్టెన్‌గా టెస్టుల్లో ఎక్కువసార్లు డకౌట్ అయిన మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సరసన ఇప్పుడు కోహ్లీ కూడా చేరాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న కీలకమైన నాలుగు టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్ అయ్యాడు. ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ వేసిన షార్ట్ పిచ్ బాల్ కొట్టబోయి కీపర్ ఫోక్స్‌కి క్యాచ్ ఇచ్చాడు.
దీనితో కలిపి ఇప్పటివరకు టీమిండియా కెప్టెన్‌గా టెస్టుల్లో ఎనిమిదిసార్లు కోహ్లీ డకౌట్ అయింది. దీంతో టెస్టుల్లో టీమిండియా కెప్టెన్‌గా ఎక్కువసార్లు డకౌట్ అయిన రికార్డు జాబితాలో కోహ్లీ చేరాడు. గతంలో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్‌గా టెస్టుల్లో ఎనిమిదిసార్లు డకౌట్ అయ్యాడు. ఇప్పుడు కోహ్లీ కూడా 8 సార్లు డకౌట్ అవ్వడంతో.. ఎక్కువసార్లు డకౌట్ అయిన కెప్టెన్ల జాబితాలో ధోనీ సరసన చేరాడు. ఇక బెన్‌స్టోక్స్‌కు ఇప్పటివరకు టెస్టుల్లో ఐదుసార్లు కోహ్లీ ఔట్ అయ్యాడు. ఇది కూడా బెన్‌స్టోక్స్‌కు ఒక రికార్డు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెన్‌స్టోక్స్ చేతిలో ఇప్పటివరకు ఏ ఆటగాడు ఇలా ఐదుసార్లు ఔట్ అవ్వలేదు.