ఐపీఎల్‌లో ఓపెనర్‌గా దిగుతా: విరాట్
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీమిండియాలో ఓపెనర్‌గా తన రోల్‌ను అర్థం చేసుకోవడానికి, వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా వెళ్లారా?.. లేదా? అనేది దీని ద్వారా తెలుస్తుందన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనర్‌గా దిగి విజృంభించాడు. దీంతో కోహ్లీ ఓపెనర్‌గా దిగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో ఓపెనర్‌గా […]
దిశ, వెబ్‌డెస్క్: ఈ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నట్లు ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. టీమిండియాలో ఓపెనర్‌గా తన రోల్‌ను అర్థం చేసుకోవడానికి, వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా వెళ్లారా?.. లేదా? అనేది దీని ద్వారా తెలుస్తుందన్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో టీ20లో రోహిత్ శర్మతో కలిసి కోహ్లీ ఓపెనర్‌గా దిగి విజృంభించాడు. దీంతో కోహ్లీ ఓపెనర్‌గా దిగితే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఇంగ్లండ్‌తో జరిగిన టీ20లో ఓపెనర్‌గా ఒక ప్రయోగం చేశాము. రోహిత్‌తో కలిసి బ్యాటింగ్ చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. భవిష్యత్తులో ఇది కొనసాగుతుందనే గ్యారంటీ లేదు’ అని కోహ్లీ వ్యాఖ్యానించాడు.
‘జట్టు కోసం ఎలాంటి పాత్ర పోషించడానికైనా నేను రెడీగా ఉన్నాను. టీ20 వరల్డ్ కప్‌కు ముందు ఓపెనర్‌గా ఎవరు వెళ్లాలనే దానిపై చర్చ జరుగుతోంది. ఐపీఎల్‌లో ఓపెనర్‌గా నేను ఎలా రాణిస్తాననేది ఆసక్తిగా ఉంది’ అని కోహ్లీ తెలిపాడు.