విరాట్ కోహ్లీకి నిషేధం ముప్పు

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో నిషేధం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల దగ్గర కోహ్లీ ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే సమయంలో తీవ్ర ఆగ్రహంతో బౌండరీ లైన్‌ను, ప్రకటనలు వచ్చే బోర్డ్‌ను పగలగొట్టాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇది తప్పు అని భావించిన మ్యాచ్ రిఫరీ కోహ్లీని మందలించి వదిలేశాడు. అయితే ఈ ఐపీఎల్‌లో కోహ్లీ ఇదే తప్పు […]

Update: 2021-04-18 04:49 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఐపీఎల్‌లో నిషేధం ముప్పు పొంచి ఉంది. చెన్నైలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల దగ్గర కోహ్లీ ఔట్ అయి డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లే సమయంలో తీవ్ర ఆగ్రహంతో బౌండరీ లైన్‌ను, ప్రకటనలు వచ్చే బోర్డ్‌ను పగలగొట్టాడు. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం ఇది తప్పు అని భావించిన మ్యాచ్ రిఫరీ కోహ్లీని మందలించి వదిలేశాడు.

అయితే ఈ ఐపీఎల్‌లో కోహ్లీ ఇదే తప్పు మళ్లీ చేస్తే నిబంధనల ప్రకారం రెండు నుంచి నాలుగు మ్యాచ్‌ల నిషేధం విధించే అవకాశముంది. ఒకవేళ నిషేధం విధించకపోతే మ్యాచ్ ఫీజులో 50 శాతం నుంచి 100 శాతం కోత విధిస్తారు. నిబంధనల ప్రకారం ఈ రెండిటీల్లో ఏదైనా చేయవచ్చు.

Tags:    

Similar News