నాలుగేండ్లుగా అలా అంగీకరించావు.. అనుష్కపై‌ విరాట్ ఆసక్తికర పోస్ట్

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే క్రికెట్‌కు విరాట్ కోహ్లీని కెప్టెన్సీగా తొలగించిన వ్యవహారం పెను దుమారం రేపుతోంది. బీసీసీఐ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నడా అంటూ సన్నిహితుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ పోస్టు పెట్టాడు. తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మూడు ఫొటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తూ.. ‘4 సంవత్సరాలుగా నువ్వు నా వెర్రి జోకులను, నా సోమరితనాన్ని హ్యాండిల్ […]

Update: 2021-12-11 06:47 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే క్రికెట్‌కు విరాట్ కోహ్లీని కెప్టెన్సీగా తొలగించిన వ్యవహారం పెను దుమారం రేపుతోంది. బీసీసీఐ నిర్ణయంతో తీవ్ర అసంతృప్తికి లోనైన కోహ్లీ వన్డే మ్యాచ్‌లకు దూరం కానున్నడా అంటూ సన్నిహితుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఇటువంటి సమయంలో విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పర్సనల్ పోస్టు పెట్టాడు.

తన వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మూడు ఫొటోలను ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తూ.. ‘4 సంవత్సరాలుగా నువ్వు నా వెర్రి జోకులను, నా సోమరితనాన్ని హ్యాండిల్ చేస్తున్నావు. ఇదే సమయంలో నన్నుగా అంగీకరించి, ఎంత చికాకుగా ఉన్నా ప్రేమిస్తున్నావు. దేవుడు మా జంటపై గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడు. అత్యంత నిజాయితీపరురాలైన, ప్రేమగల, ధైర్యవంతురాలైన మహిళతో వివాహమై 4 సంవత్సరాలు పూర్తయింది. ప్రపంచం మొత్తం వ్యతిరేకంగా ఉన్నప్పటికీ సరైన విషయంలో నిలబడేలా నన్ను ప్రేరేపించిన అనుష్కను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను’ అంటూ కోహ్లీ అనుష్కపై‌ ప్రేమ ఒలకబోశాడు.

Tags:    

Similar News