కోహ్లీ సరికొత్త రికార్డు.. ఐపీఎల్‌లో ‘డబుల్ సెంచరీ’
దిశ, వెబ్‌డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2008 లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన […]
దిశ, వెబ్‌డెస్క్ : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు చేరింది. ఐపీఎల్ లీగ్ చరిత్రలో ఒకే జట్టు తరఫున 200 మ్యాచ్‌లు ఆడిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2008 లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి కోహ్లి బెంగళూరు జట్టుకు ఆడుతున్న విషయం తెలిసిందే. నిన్న జరిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ మ్యాచ్‌తో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు.
కోహ్లి తర్వాత ఒకే జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో ఇద్దరు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లు… ముంబయి ఇండియన్స్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. చెన్నై తరపున టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తర్వాతి స్థానంలో ఉన్నాడు. చెన్నై తరఫున 182 మ్యాచ్‌లు ఆడాడు. తర్వాత సురేశ్ రైనా 172 మ్యాచ్‌లు, కీరన్ పోలార్డ్ ముంబయి ఇండియన్స్ తరఫున 172 మ్యాచ్‌లు, రోహిత్ శర్మ 162 మ్యాచ్‌లు ఆడి వరుసగా 3, 4, 5 స్థానాల్లో ఉన్నారు. సురేశ్ రైనా, కీరన్ పోలార్డ్ చేరో 172 మ్యాచ్ లు ఆడారు.