12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో విరాట్ కోహ్లీ
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Team India captain Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లోకి అడుగుపెట్టి మంగళవారం (ఆగస్టు 18) నాటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంక జట్టు (Sri Lanka team)పై కోహ్లీ అరంగేట్రం (international debut)మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ రాణించలేకపోయినా, అతి తక్కువ సమయంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. పూర్తి స్థాయి సభ్యుడిగా టీం ఇండియా […]
దిశ, స్పోర్ట్స్: టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ (Team India captain Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్ (International Cricket)లోకి అడుగుపెట్టి మంగళవారం (ఆగస్టు 18) నాటికి 12 ఏళ్లు పూర్తయ్యాయి. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంక జట్టు (Sri Lanka team)పై కోహ్లీ అరంగేట్రం (international debut)మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ రాణించలేకపోయినా, అతి తక్కువ సమయంలోనే భారత జట్టులో కీలక సభ్యుడిగా మారాడు.
పూర్తి స్థాయి సభ్యుడిగా టీం ఇండియా (Team India)లో కొనసాగుతూనే 2017లో మూడు ఫార్మాట్ల (Three formats)కు కెప్టెన్ (Captain)గా బాధ్యతలు చేపట్టాడు. ఇప్పటి వరకు 86 టెస్టులు, 248 వన్డేలు, 82 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన కొహ్లీ, టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. అన్ని ఫార్మాట్ల (All formats)లో కలిపి 104 అర్ధ సెంచరీలు (Half Centuries) నమోదు చేశాడు.
ఐపీఎల్ తొలి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్టుతోనే ఉన్న కోహ్లీ, 2013లో ఆ జట్టు కెప్టెన్ (Captain)గా నియమించబడ్డాడు. ప్రస్తుతం రూ.17కోట్లతో అత్యధిక జీతం అందుకునే ఐపీఎల్ ప్లేయర్ (IPL Player)గా కోహ్లీ గుర్తింపుపొందాడు.
కోహ్లీ 12 ఏండ్ల కెరీర్‌లో ప్రధాన అంశాలు:
– 2008లో వన్డే అంతర్జాతీయ కెరీర్ (ODI International Career) ప్రారంభించిన కోహ్లీ, 2011, 2015, 2019 వరల్డ్ కప్ జట్టులో సభ్యుడు (Member of the World Cup squad).
– 2012లో ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు (ICC ODI Cricketer of the Year Award) గెలుచుకున్నాడు.
– వన్డేల్లో అత్యంత వేగంగా 10వేల పరుగులు పూర్తి చేసి, సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు (Breaking the record) కొట్టాడు.
– 2008లో జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ (Under-19 World Cup)లో భారత జట్టుకు కెప్టెన్ (Captain)గా వ్యవహరించాడు.
– ఆడిన తొలి వరల్డ్ కప్ (First World Cup)లోనే సెంచరీ (Century) చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మెన్ కొహ్లీ
– 2013లో తొలి సారిగా ఐసీసీ వన్డే ర్యాంకింగ్ (ICC ODI Rankings)లో నెంబర్ 1 బ్యాట్స్‌మాన్ (No. 1 batsman)గా నిలిచాడు
– టీ20లో వేసిన తొలి బంతికే వికెట్(Kevin Peterson) తీసిన రికార్డు కోహ్లీ పేరిట ఉంది.
– తన తండ్రి చనిపోయాడని తెలిసినా.. ఆ రోజు ఢిల్లీ జట్టును గెలిపించడానికి 2016లో కర్ణాటకతో రంజీ మ్యాచ్ ఆడాడు.
– 2012లో ఉత్తమ వస్త్రధారణ (The best attire) కలిగిన అంతర్జాతీయ పురుషుల అవార్డు (International Men’s Award)ను కోహ్లీ గెలుచుకున్నాడు.
– టీ20లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసుకున్న భారతీయ బ్యాట్స్‌మాన్ కొహ్లీ కావడం గమనార్హం.