అన్నాచెల్లెల్లు ఫైర్ మీదున్నారు : విరాట్ కోహ్లీ
బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నిర్మించిన వెబ్ ఫిల్మ్ ‘బుల్ బుల్’. బుధవారం విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కాగా ‘బుల్ బుల్’ చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ చిత్రానికి తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు. అంతేకాదు తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. ‘ఈ సినిమా కథ నాకెంతో నచ్చింది. సినిమా చెప్పిన విధానమూ ఎంతో గొప్పగా ఉంది. అన్నాచెల్లెల్లు ఫైర్ మీదున్నారు […]
బాలీవుడ్ బ్యూటీ, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ నిర్మించిన వెబ్ ఫిల్మ్ ‘బుల్ బుల్’. బుధవారం విడుదలైన ఈ చిత్రానికి ఇప్పటికే పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. కాగా ‘బుల్ బుల్’ చూసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ చిత్రానికి తనదైన స్టైల్‌లో రివ్యూ ఇచ్చాడు. అంతేకాదు తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించాడు.
‘ఈ సినిమా కథ నాకెంతో నచ్చింది. సినిమా చెప్పిన విధానమూ ఎంతో గొప్పగా ఉంది. అన్నాచెల్లెల్లు ఫైర్ మీదున్నారు (అనుష్క శర్మ, కర్ణేశ్). సినిమా విడుదలైంది. డోంట్ మిస్ ఇట్ గయ్స్’ అంటూ తన అభిప్రాయాన్ని ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ.. సినిమా పోస్టర్‌ను జత చేశాడు. కాగా అనుష్క శర్మ ఇటీవలే నిర్మించిన పాతాల్ లోక్ వెబ్ సిరీస్‌పై కూడా విరాట్ ఇదే విధంగా స్పందించాడు. ‘పాతాల్‌లోక్ వెబ్ సిరీస్‌ను చూశాను. స్క్రీన్‌ప్లే, కథ విషయంలో ఇది ఒక మాస్టర్ పీస్, అంతేకాక.. అందరూ అద్భుతంగా నటించారు. అద్భుతమైన వెబ్‌సిరీస్‌లను నిర్మిస్తున్న నా లవ్ అనుష్క శర్మను చూసి చాలా గర్వపడుతున్నాను’ అంటూ విరాట్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
బుల్ బుల్ సినిమాకు అన్వితాదత్ దర్శకత్వం వహించగా, రాహుల్ బోస్, తృప్తి డిమ్రీ, అవినాష్ తివారీ, పరంబ్రాత ఛటోపాధ్యాయలు ముఖ్య పాత్రలు పోషించారు. అనుష్క శర్మ విషయానికి వస్తే.. ఆమె ‘జీరో’ సినిమా తర్వాత .. ఏ సినిమాను సైన్ చేయకపోవడం గమనార్హం.