కీవ్ టోర్నమెంట్‌లో వినేష్‌కు స్వర్ణం
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకం గెలుచుకున్నది. రెజ్లర్స్ అండ్ కోచెస్ మెమోరియల్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ కలద్‌జిన్‌స్కేపై గెలుపొందింది. 53 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో తొలుత వినేష్ 4-0తో ముందుకు దూసుకొని వెళ్లింది. కానీ ప్రత్యర్థి కలద్‌జిన్‌స్కే పుంజుకొని 4-4తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరు రెజ్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 10-8 పాయింట్ల […]
దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్ ఉక్రెయిన్‌లోని కీవ్‌లో జరిగిన టోర్నమెంట్‌లో చాంపియన్‌గా అవతరించి స్వర్ణ పతకం గెలుచుకున్నది. రెజ్లర్స్ అండ్ కోచెస్ మెమోరియల్ టోర్నమెంట్ ఫైనల్స్‌లో మాజీ ప్రపంచ చాంపియన్ కలద్‌జిన్‌స్కేపై గెలుపొందింది. 53 కేజీల విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో తొలుత వినేష్ 4-0తో ముందుకు దూసుకొని వెళ్లింది. కానీ ప్రత్యర్థి కలద్‌జిన్‌స్కే పుంజుకొని 4-4తో స్కోర్ సమం చేసింది. ఆ తర్వాత ఇద్దరు రెజ్లర్లు హోరాహోరీగా తలపడ్డారు. చివరకు 10-8 పాయింట్ల తేడాతో వినేష్ ఫోగట్ చాంపియన్‌గా అవతరించింది. కరోనా కారణంగా ఏడాది కాలంగా అంతర్జాతీయ రెజ్లింగ్ పోటీలు జరగలేదు. ఇప్పటికే టోక్యో ఒలంపిక్స్‌కు అర్హత సాధించిన వినేష్.. ఈ ఏడాది జరిగిన తొలి టోర్నీలోనే స్వర్ణ పతకం సాధించడం గమనార్హం.