ఉద్యమంలా బహుజన బతుకమ్మ
దిశ ప్రతినిధి, మెదక్: బహుజన బతుకమ్మను ఉత్సవంలా కాదు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళుదామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారథి విమలక్క పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…కోవిడ్-19 వల్ల మరణించిన వారికి బహుజన బతుకమ్మ తరపున నివాళులను అర్పించారు. కోవిడ్ నేపథ్యంలో వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలను జనసందోహం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ జరుపు […]
దిశ ప్రతినిధి, మెదక్: బహుజన బతుకమ్మను ఉత్సవంలా కాదు ఉద్యమంలా ముందుకు తీసుకెళ్ళుదామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సారథి విమలక్క పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ…కోవిడ్-19 వల్ల మరణించిన వారికి బహుజన బతుకమ్మ తరపున నివాళులను అర్పించారు. కోవిడ్ నేపథ్యంలో వలస కూలీలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండగలను జనసందోహం లేకుండా భౌతిక దూరం పాటిస్తూ జరుపు కోవాలని కోరారు. దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న హత్యాచార ఘటనలు దుర్మార్గమైనవని అన్నారు. హత్యాచార బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఆడపిల్లలను బ్రతకనిద్దాం… బ్రతుకునిద్దాం అనే నినాదం తో ముందుకు పోదామన్నారు. ఈ నెల 12 న బహుజన బతుకమ్మ పాటను ఆవిష్కరించనున్నట్టు తెలిపారు. ఈ నెల 16 నుండి 24 వరకు బహుజన బతుకమ్మ కార్యక్రమాలు ప్రతి గ్రామంలో నిర్వహించాలన్నారు.