గ్రామంలో హడలుపుట్టిస్తున్న దెయ్యం.. రాత్రికి రాత్రే గ్రామస్థుల సంచలన నిర్ణయం
దిశ, గూడూరు : మారుమూల గ్రామాల్లో మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రజలను మూఢ నమ్మకాలు వదలడం లేదు అనడానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చోటు చేసుకున్న వింత ఘటననే నిదర్శణం. గ్రామానికి దెయ్యంపట్టిందని గ్రామస్తులు గ్రామాన్ని విడిచి పెట్టిన ఘటన జిల్లాలోని పాటి మీది గూడెంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గత నెల రోజుల వ్యవధిలో పాటి మీది గూడెంలో 8 మంది వరకు చనిపోయారు అందులో కొంత […]
దిశ, గూడూరు : మారుమూల గ్రామాల్లో మూఢ నమ్మకాలు ఇంకా రాజ్యమేలుతున్నాయి. ఎంత టెక్నాలజీ పెరిగినా ప్రజలను మూఢ నమ్మకాలు వదలడం లేదు అనడానికి మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో చోటు చేసుకున్న వింత ఘటననే నిదర్శణం. గ్రామానికి దెయ్యంపట్టిందని గ్రామస్తులు గ్రామాన్ని విడిచి పెట్టిన ఘటన జిల్లాలోని పాటి మీది గూడెంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే.. గత నెల రోజుల వ్యవధిలో పాటి మీది గూడెంలో 8 మంది వరకు చనిపోయారు అందులో కొంత మంది అనారోగ్య సమస్యల వల్ల, ఇద్దరు యువకులు ఆత్మ హత్య చేసుకున్నారు. గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తుండడంతో గ్రామస్తులు గూడూరులోని ఒక భూత వైద్యున్ని సంప్రదించగా మీ గ్రామానికి దెయ్యం పట్టిందని అది మీ గ్రామాన్ని వదిలి వెళ్ళాలంటే గ్రామస్థులు అందరూ ఉదయం లేవగానే గ్రామాన్ని వదిలి ఒకరోజు మొత్తం అడవిలో వనభోజనాలకు వెళ్ళాలని అలా అయితే గ్రామానికి పట్టిన దెయ్యం వదులుతుంది అని చెప్పారు. దీంతో గ్రామస్తులంతా ఏకమై ఒక రోజు మొత్తం ఇంటిల్లీపాదీ అందరూ ఇంటికి తాళం వేసి అడవిలోకి వంటలకు వెళ్లారు… అభివృద్దికి ఆమడ దూరంలో ఉండడం వలనే ఈ గ్రామంలో ఇలా జరుగుతుందంటున్నారు కొందరు. ఈ మూఢనమ్మకాలను వదిలి ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా అధికారులు కృషి చేయాలి ప్రజలకు మూఢనమ్మకాలపై భయాలు తొలగిపోయేలా చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని వేడుకుంటున్నారు.