మా సమస్యలు పరిష్కరించిన తర్వాతే.. టోల్ గేట్ ప్రారంభించాలి..

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని టోల్ ప్లాజాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడం పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుమ్మడిదల టోల్ ప్లాజా‌ను నిర్వాహకులు ఎటువంటి సమాచారం లేకుండా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి‌లు నిర్వాహకులను నిలదీశారు. యాజమాన్యం‌తో వాగ్వాదానికి దిగారు. మా సమస్యలు తీర్చాకే టోల్ గేట్ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. టోల్ […]

Update: 2021-12-17 08:09 GMT

దిశ, గుమ్మడిదల: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలోని టోల్ ప్లాజాను ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రారంభించడం పట్ల స్థానిక ప్రజా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం గుమ్మడిదల టోల్ ప్లాజా‌ను నిర్వాహకులు ఎటువంటి సమాచారం లేకుండా ప్రారంభించారు. విషయం తెలుసుకున్న జెడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీపీ సద్ది ప్రవీణ విజయ భాస్కర్ రెడ్డి‌లు నిర్వాహకులను నిలదీశారు. యాజమాన్యం‌తో వాగ్వాదానికి దిగారు. మా సమస్యలు తీర్చాకే టోల్ గేట్ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. టోల్ ప్లాజా కోసం రైతుల భూములు కోల్పోయారని ముందుగా వారికి నష్టపరిహారం చెల్లించి న్యాయం చేసిన తరువాతే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

మంబాపూర్ నుండి అన్నారం వరకు రోడ్డు వీధి దీపాలు ఏర్పాటు చేయాలని వాటి విద్యుత్ బిల్లులను కూడా యాజమాన్యం భరించాలన్నారు. అంతేకాకుండా గుమ్మడిదల మండల వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల వాహనాలకు ఉచితంగా పాసులు అందించాలని నిర్వాహకులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News