గ్రామీణులు ‘కొవిడ్’ జాగ్రత్తలు పాటించాలి

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణులు కొవిడ్ దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం నుంచి గురువారం పలు జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్టర్లు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్ పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, స‌ర్పంచ్ లు, గ్రామ కార్యద‌ర్శులు తదిత‌ర అధికారుల‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమం ఒక జీవ‌న విధానం కావాలని ఆయన సూచించారు. కరోనా […]

Update: 2021-04-08 10:56 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణులు కొవిడ్ దరిచేరకుండా జాగ్రత్తలు పాటించాలని పంచాయతీరాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం నుంచి గురువారం పలు జిల్లాల అడిష‌న‌ల్ క‌లెక్టర్లు, డీఆర్డీవోలు, డీపీవోలు, డీఎల్ పీవోలు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, స‌ర్పంచ్ లు, గ్రామ కార్యద‌ర్శులు తదిత‌ర అధికారుల‌తో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. గ్రామాల్లో ప‌ల్లె ప్రగ‌తి కార్యక్రమం ఒక జీవ‌న విధానం కావాలని ఆయన సూచించారు. కరోనా నేపథ్యంలో సర్పంచ్ లు, కార్యదర్శులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆశవ‌ర్కర్లు అప్రమత్తంగా ఉండి పారిశుద్ధ్య పనులు చేపట్టి మరిన్ని అవార్డులు వచ్చేలా కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు.

శానిటేష‌న్ యాప్ ను వినియోగించాలి

గ్రామపంచాయతీలు తప్పనిసరిగా శానిటేషన్ యాప్ ను వినియోగించాలని, ఆ యాప్ ద్వారా ప్రతిరోజూ నిర్వహిస్తున్న పారిశుద్ధ్య వివ‌రాల‌ను పంచాయతీ కార్యదర్శులు పొందుప‌ర‌చాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ యాప్ లో రోజూవారి స‌మ‌స్యలపై ఫీడ్ బ్యాక్ ఇవ్వొచ్చని, కార్యద‌ర్శులు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌ను కూడా అందులో చెప్పుకునేందుకు అవకాశముందని మంత్రి పేర్కొన్నారు. అంతేకాకుండా ఏడు ర‌కాల రిజిస్టర్లకు సంబంధించిన స‌మ‌స్యల‌ను కూడా మీరు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చని ఆయన అన్నారు.

Tags:    

Similar News