డబుల్ ఇండ్లు ప్రారంభించండి.. హైవేను బ్లాక్ చేసి గ్రామస్తుల నిరసన

దిశ, కరీంనగర్ సిటీ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి మూడేళ్లయినా ప్రారంభించడం లేదంటూ, ఆ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి, ధర్నాకు దిగారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్ గ్రామ ఆమ్లెట్ రాములపల్లి గ్రామస్తులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేములవాడ-కరీంనగర్ హైవే‌ రోడ్డెక్కారు. మానేర్ డ్యాం బ్యాక్ వాటర్ కారణంగా తమ ఇళ్లలోకి నీటితో పాటు పాములు, తేళ్ళు, విషపురుగులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం […]

Update: 2021-07-22 06:38 GMT

దిశ, కరీంనగర్ సిటీ : డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి మూడేళ్లయినా ప్రారంభించడం లేదంటూ, ఆ గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించి, ధర్నాకు దిగారు. కొత్తపల్లి మండలంలోని కమాన్‌పూర్ గ్రామ ఆమ్లెట్ రాములపల్లి గ్రామస్తులు గురువారం రాష్ట్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ వేములవాడ-కరీంనగర్ హైవే‌ రోడ్డెక్కారు. మానేర్ డ్యాం బ్యాక్ వాటర్ కారణంగా తమ ఇళ్లలోకి నీటితో పాటు పాములు, తేళ్ళు, విషపురుగులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇప్పటికీ మూడేళ్ళు పూర్తయిన అధికారులు ఎందుకు ప్రారంభోత్సవం నిర్వహించడం లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రామస్తులు నిర్వహిస్తున్న ఈ ధర్నాకు స్థానిక బీజేపీ నాయకులు మద్దతుగా నిలిచారు. ఆ సందర్భంగా ఆ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వేముల అనిల్ కుమార్ మాట్లాడుతూ.. నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభోత్సవం వెనుక జాప్యం కనబరచడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు.

టీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సమయంలో హామీలిచ్చి, వాటిని నెరవేర్చకుండా ప్రజలే రోడ్డెక్కేదాకా చూడటం సిగ్గుచేటన్నారు. కొత్తపల్లి మండలంలోని 4 గ్రామాల్లో నిర్మించిన 137 డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే ప్రారంభించకపోతే అధికారుల కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు మెరుగు మల్లేశం, ఆరె నరేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:    

Similar News