మా బ్రతుకులతో ఆడుకోకండి.. సర్కార్ అలా చేస్తే ఆత్మహత్యలే దిక్కు..

దిశ ప్రతినిధి, మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం మరో టీఎంసీకి అదనపు భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనూ భూ సేకరణ చేపట్టారు. ఆ సమయంలో సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి గ్రామస్తులు పలుమార్లు అడ్డుకున్నారు. గురువారం మరోమారు అధికారులు భూ సేకరణపై సర్వే చేపట్టగా.. గ్రామస్తులు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు. అదనపు భూ సేకరణను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో, […]

Update: 2021-07-29 09:57 GMT

దిశ ప్రతినిధి, మెదక్ : మల్లన్నసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ కోసం మరో టీఎంసీకి అదనపు భూ సేకరణ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలోనూ భూ సేకరణ చేపట్టారు. ఆ సమయంలో సిద్దిపేట మండలం చిన్నగుండవెల్లి గ్రామస్తులు పలుమార్లు అడ్డుకున్నారు. గురువారం మరోమారు అధికారులు భూ సేకరణపై సర్వే చేపట్టగా.. గ్రామస్తులు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళన నిర్వహించారు.

అదనపు భూ సేకరణను రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో, అప్రమత్తమైన పోలీస్ యంత్రాంగం ఆందోళన నిర్వహిస్తున్న చిన్నగుండవెల్లి గ్రామస్తులను అదుపులోకి తీసుకొని ప్రత్యేక టిండర్‌లో తరలించారు. ఈ విషయంపై కొందరు భూ నిర్వాసితులు ‘దిశ’తో మాట్లాడారు. ఇప్పటికే మల్లన్నసాగర్ కోసం తమ విలువైన భూములు కోల్పోయామని అన్నారు. ఇప్పుడు మళ్లీ అదనపు టీఎంసీ కోసం తిరిగి భూ సేకరణ చేపట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు.

మా బ్రతుకులు ఇప్పటికే అంధకారంలోకి నెట్టివేయబడ్డాయని అన్నారు. ఉన్న కాస్త భూమిని సాగు చేసుకోవడానికి మాకు అవకాశం కల్పించాలి తప్ప.. మా భూములు బలవంతంగా లాక్కోద్దని కోరారు. కాదని ప్రభుత్వం భూ సేకరణ చేపడితే మాకు ఆత్మహత్యలే శరణ్యమవుతాయంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News