చెరువు లూటీ …ఊరంతా పోటీ
దిశ, మహబూబాబాద్ : సామన్యంగా చేపలు వర్షకాలం ప్రారంభంలో పట్టడం జరుగుతుంది. కానీ వర్షకాలం ప్రారంభం కాకముందే చిన్న, పెద్ద తేడాలేకుండా చేపల వేటకు వెళ్లారు ఓ ఊరి ప్రజలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మండలంలోని మైలారం తండా లో గల చెరువు లూటీ కావడంతో ఆ గ్రామ ప్రజలు చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే చిన్న,పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా చేతిలో వల పట్టుకొని చేపలు పట్టారు. వందలాది […]
దిశ, మహబూబాబాద్ : సామన్యంగా చేపలు వర్షకాలం ప్రారంభంలో పట్టడం జరుగుతుంది. కానీ వర్షకాలం ప్రారంభం కాకముందే చిన్న, పెద్ద తేడాలేకుండా చేపల వేటకు వెళ్లారు ఓ ఊరి ప్రజలు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడా మండలంలోని మైలారం తండా లో గల చెరువు లూటీ కావడంతో ఆ గ్రామ ప్రజలు చేపలు పట్టేందుకు పోటీ పడ్డారు. శుక్రవారం తెల్లవారుజామున నుంచే చిన్న,పెద్ద, ముసలి ముతక అనే తేడా లేకుండా చేతిలో వల పట్టుకొని చేపలు పట్టారు. వందలాది మంది చెరువులో చేపలు పట్టేందుకు దిగడంతో దీన్ని చుూసిన వారు కుంభమేళా జాతర లా ఉందని చర్చించుకుంటున్నారు.