డ్యాన్సింగ్ క్వీన్‌నే మెప్పించిన పల్లెటూరి యువతి

దిశ, సినిమా: నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఓ పల్లెటూరు యువతి డ్యాన్సింగ్ స్కిల్స్.. బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ మాధురి దీక్షిత్‌ ఫిదా అయిపోయింది. సోషల్ మీడియా కారణంగానే వెలుగులోకి వచ్చిన ఈ మట్టిలో మాణిక్యం.. 1957లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మదర్ ఇండియా’లోని ‘గోగత్ నహీన్’ అనే పాటకు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు నిమిషాల 20 సెకన్ల పాటు ఆమె డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోను యూపీ, ఘజియాబాద్‌‌లో సంప్రదాయ నృత్యాన్ని […]

Update: 2021-02-09 02:42 GMT

దిశ, సినిమా: నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్న ఓ పల్లెటూరు యువతి డ్యాన్సింగ్ స్కిల్స్.. బాలీవుడ్ హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ మాధురి దీక్షిత్‌ ఫిదా అయిపోయింది. సోషల్ మీడియా కారణంగానే వెలుగులోకి వచ్చిన ఈ మట్టిలో మాణిక్యం.. 1957లో వచ్చిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘మదర్ ఇండియా’లోని ‘గోగత్ నహీన్’ అనే పాటకు చేసిన డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. రెండు నిమిషాల 20 సెకన్ల పాటు ఆమె డ్యాన్స్ చేయగా.. ఆ వీడియోను యూపీ, ఘజియాబాద్‌‌లో సంప్రదాయ నృత్యాన్ని ప్రమోట్ చేస్తున్న ‘రాగిరి’ ఎన్జీవో వారు ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. ఈ వీడియో చూస్తే నృత్యకారులు రెక్కలు అవసరం లేకున్నా ఎగరగలరని అనిపిస్తోందని, దీనిపై మీ అభిప్రాయాలను తెలపండని మాధురి దీక్షిత్, హేమమాలినికి ట్యాగ్ చేశారు.

కాగా ఈ ట్వీట్‌పై స్పందించిన మాధురి.. ‘వావ్ ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేస్తోంది. ఇలాంటి వారి ప్రతిభను వెలికి తీయాల్సిన అవసరం ఉంది’ అని ట్విట్టర్‌లో ఆ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. దీంతో నెటిజన్లు మాధురికి థాంక్స్ చెబుతున్నారు. సహజంగా, అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి పల్లెటూరి యువతి ప్రతిభ ఇప్పుడే వెలుగులోకి వచ్చిందని, ఆమెకు మీ డ్యాన్స్ అకాడమీలో అవకాశామివ్వండని మాధురిని కోరుతున్నారు. కాగా, భారత్‌లోని మారుమూల గ్రామాల్లో ఇలాంటి వారు ఎందరో ఉన్నారని, వారిని గుర్తించి కొంత ట్రైనింగ్ ఇస్తే అత్యద్భుతంగా రాణిస్తారని మరికొందరు అంటున్నారు.

Tags:    

Similar News