రాజమౌళి- మహేశ్ బాబు.. విలన్‌గా విక్రమ్?

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అపరిచితుడు’ మూవీతో టాలీవుడ్‌లో బిగ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి తను తమిళ్‌లో నటించిన ప్రతీ చిత్రం తెలుగులో విడుదలవుతున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. అయినా ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని విక్రమ్.. విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో పట్టాలెక్కనున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో యాంటగోనిస్ట్ రోల్ కోసం విక్రమ్‌ను సంప్రదించినట్లు సమాచారం. […]

Update: 2021-11-24 02:32 GMT

దిశ, సినిమా : కోలీవుడ్ స్టార్ యాక్టర్ చియాన్ విక్రమ్.. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘అపరిచితుడు’ మూవీతో టాలీవుడ్‌లో బిగ్ మార్కెట్ సంపాదించుకున్నాడు. అప్పటి నుంచి తను తమిళ్‌లో నటించిన ప్రతీ చిత్రం తెలుగులో విడుదలవుతున్నప్పటికీ సరైన హిట్ మాత్రం దక్కడం లేదు. అయినా ప్రయోగాలకు ఎప్పుడూ వెనుకాడని విక్రమ్.. విలన్‌గా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

‘ఆర్‌ఆర్‌ఆర్’ తర్వాత రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో పట్టాలెక్కనున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌లో యాంటగోనిస్ట్ రోల్ కోసం విక్రమ్‌ను సంప్రదించినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే డైరెక్టర్‌ను కలిసి క్యారెక్టర్ గురించి డిస్కస్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్నారు. కాగా విక్రమ్ ప్రస్తుతం ‘పొన్నియన్ సెల్వన్’, ‘మహాన్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

Tags:    

Similar News