ఆ రెడ్ జోన్ ఏరియాలో ఇప్పుడు నో కరోనా!

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ అక్కడి జనానికి కంటికి కునుకు లేకుండా చేసింది. ఏ వైపు నుంచి ఏ విధంగా వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారుగా 25 రోజులపాటు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. కానీ, ఇప్పుడు వారు అజ్ఞాతం వీడి వెలుగులోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి సరిగ్గా గత 10 రోజుల క్రితం వరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉండేది. ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. మొదటగా ఈ […]

Update: 2020-04-28 04:57 GMT

దిశ, రంగారెడ్డి: కరోనా వైరస్ అక్కడి జనానికి కంటికి కునుకు లేకుండా చేసింది. ఏ వైపు నుంచి ఏ విధంగా వస్తుందోనని బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. సుమారుగా 25 రోజులపాటు ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టలేదు. కానీ, ఇప్పుడు వారు అజ్ఞాతం వీడి వెలుగులోకి వచ్చినట్లు భావిస్తున్నారు. ఈ పరిస్థితి సరిగ్గా గత 10 రోజుల క్రితం వరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఉండేది. ఇప్పుడిప్పుడే అక్కడి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. మొదటగా ఈ జిల్లాలో కరోనా వైరస్ అంతగా ప్రభావితం కాలేదు. కానీ, అతితక్కువ కాలంలో అధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో వికారాబాద్ పట్టణాన్ని రెడ్ జోన్ ఏరియాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి, కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయడంతో పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి.

డిశ్చార్జ్ అయ్యే అవకాశం..

వికారాబాద్ జిల్లాలో 656 మంది నుంచి నమూనాలను సేకరించారు. ఇందులో 38 మందికి మాత్రమే కరోనా సోకిందని, మిగితా వారికి సోకలేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. పాజిటివ్ కేసుల్లో ఒకరు మృతి చెందగా 11 మంది డిశ్చార్జ్ అయ్యారు. మిగిలిన 26 మంది చికిత్స పొందుతున్నారు. వారిలో కొంతమంది రెండు, మూడు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉంది. కరోనా అనుమానిత 30 మంది క్వారంటైన్ లో ఉండగా, 11529 మంది హోం క్వారంటైన్ లో ఉన్నట్లు సమాచారం.

అధికారుల కృషి ఫలించింది..

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో ముందుకెళ్లారు. పోలీసుల బందోబస్తు, వైద్య సిబ్బంది, రెవెన్యూ అధికారులు నిరంతర పర్యవేక్షణతో వైరస్ ను నివారించగలిగారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనంద్, కలెక్టర్ పౌసమి బసు, ఎస్పీ నారాయణలు.. ప్రజా అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ప్రజలకు ఏ లోటు లేకుండా తగు జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నారు. ఇక జిల్లాలో కేసులుండవని కలెక్టర్ చెబుతున్నారు.

Tags: Vicarabad, Corona Virus, Positive Cases, Declining, Discharge

Tags:    

Similar News