తెరవెనుక రాజకీయాలకు.. బీజేపీ కేరాఫ్ అడ్రస్

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ రాజధానుల విషయంలో బీజేపీ నిజస్వరూపం ఏంటో బయటపడిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ నయవంచనకు హైకోర్టులో వేసిన అఫిడవిటే నిదర్శనం అని తెలిపారు. బీజేపీ ఒక మేక వన్నె పులి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు మూల కారణం బీజేపీయే అని అన్నారు. తెర […]

Update: 2020-08-19 07:49 GMT
తెరవెనుక రాజకీయాలకు.. బీజేపీ కేరాఫ్ అడ్రస్
  • whatsapp icon

అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరహరిశెట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ రాజధానుల విషయంలో బీజేపీ నిజస్వరూపం ఏంటో బయటపడిందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.

బీజేపీ నయవంచనకు హైకోర్టులో వేసిన అఫిడవిటే నిదర్శనం అని తెలిపారు. బీజేపీ ఒక మేక వన్నె పులి అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు మూల కారణం బీజేపీయే అని అన్నారు. తెర వెనుక రాజకీయాలకు, కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ బీజేపీ అని నరసింహారావు ధ్వజమెత్తారు. బీజేపీ, వైసీపీ తెరవెనుక రాజకీయాలకు కేంద్రం నిర్ణయమే తార్కాణం అని విమర్శించారు.

Tags:    

Similar News