ఎంపీ అసదుద్దీన్‌కి విజయశాంతి సూటి ప్రశ్న
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో 135 కోట్లకు పైగా ఉన్న జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజమని, ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ‘2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారు? ప్రధాని మోదీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్విట్టర్ వేదికగా ఖండించారు. […]
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో 135 కోట్లకు పైగా ఉన్న జనాభాకు కోవిడ్ వ్యాక్సిన్ కొరత సహజమని, ప్రపంచం మొత్తం ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ‘2020 జూలైలోనే వ్యాక్సిన్ ఆర్డర్ ఇచ్చి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు.. వ్యాక్సిన్ కొరత ఉంటే 25 శాతం ప్రైవేట్ ఆస్పత్రులకు ఎందుకిస్తున్నారు? ప్రధాని మోదీ వీఐపీ కల్చర్‌ను ప్రోత్సహిస్తున్నారు’ అంటూ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలను మంగళవారం ట్విట్టర్ వేదికగా ఖండించారు. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ కొరత ఉందంటూ మోదీపై ఒవైసీ చేసిన విమర్శలను తనదైన శైలీలో తిప్పి కొట్టారు. 2020 జూలైలో ఎక్కడ ఆమోదించబడ్డ వ్యాక్సిన్‌కు, ఎవరికి ఆర్డర్ ఇచ్చి ఉండాలి..? ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ ట్విన్ పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు చెప్పలేదా..?అని ప్రశ్నించారు. 25 శాతం ప్రైవేటు హాస్పిటల్స్‌కి ఇవ్వడం వీఐపీ కల్చర్ అయితే… టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ కల్చర్ కోసమా..? అని ఒవైసీని ప్రశ్నించారు.