సీఎం కేసీఆర్ చేతులెత్తేశారు: విజయశాంతి

దిశ, వెబ్‌డెస్క్: మాయ మాటలు, ఉచిత సలహాలతో మేధావిగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ కట్టడిలో చేతగాక చేతులెత్తేశారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. సీఎం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణపై ఆందోళన వ్యక్తం చేసిన విజయశాంతి.. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. ప్రజాతీర్పు తనకే అనుకూలం అని విర్రవీగుతున్న దొరగారికి ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు. కరోనాపై ప్రతిపక్షాలు హెచ్చరిస్తే వారిని హేళన […]

Update: 2020-07-07 06:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాయ మాటలు, ఉచిత సలహాలతో మేధావిగా చెప్పుకునే సీఎం కేసీఆర్ కరోనా వైరస్ కట్టడిలో చేతగాక చేతులెత్తేశారని కాంగ్రెస్ నేత విజయశాంతి విమర్శించారు. సీఎం అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారిందన్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ విజృంభణపై ఆందోళన వ్యక్తం చేసిన విజయశాంతి.. సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ తప్పులు నానాటికీ పెరిగిపోతున్నాయన్నారు. ప్రజాతీర్పు తనకే అనుకూలం అని విర్రవీగుతున్న దొరగారికి ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదన్నారు.

కరోనాపై ప్రతిపక్షాలు హెచ్చరిస్తే వారిని హేళన చేశారని, తగిన వైద్య వసతులు లేవని వార్తలు వస్తే మీడియా యాజమాన్యానికి శాపనార్థాలు పెట్టారన్నారు. కరోనా పరీక్షల్లో ప్రభుత్వ అలసత్వాన్ని హైకోర్టు తప్పుబట్టినా సీఎం ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. కేసీఆర్ తన బాధ్యతల నిర్వహణలో విఫలం కావడంతో గవర్నర్ జోక్యం చేసుకోవడాన్ని రాష్ట్ర ప్రజలు స్వాగతిస్తున్నారని పేర్కొన్నారు. గవర్నర్ చొరవను అడ్డుకునే ప్రయత్నం చేయడం దొర నిరంకుశత్వానికి పరాకాష్ఠ అంటూ ట్విట్టర్‌లో విజయశాంతి ధ్వజమెత్తారు.

Tags:    

Similar News