రాములమ్మకు రాజకుమారుడి విషెస్

వెండితెరపై పోషించిన ఏ పాత్రకైనా వంద శాతం న్యాయం చేసి.. లేడీ సూపర్‌‌స్టార్‌గా ఎదిగింది. అభిమానులతో లేడీ అమితాబ్ అని ప్రేమగా పిలిపించుకుంది. గ్లామర్ పాత్రలతో మెప్పిస్తూనే.. పవర్‌ఫుల్ రోల్స్‌కు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది. తెలంగాణ ప్రజలు ఆమెను రాములమ్మగా పిలిచినా.. వెండితెర ప్రముఖులు విశ్వ నటభారతిగా గుర్తించినా.. ఆమెకే చెల్లింది. అసలు పేరు శాంతికి.. తన పిన్ని పేరు ‘విజయ’ను చేర్చుకుని ‘విజయశాంతి’గా సిల్వర్‌‌స్క్రీన్‌పై విజయఢంకా మోగించిన హీరోయిన్ ‘విజయ శాంతి’. బుధవారం […]

Update: 2020-06-24 06:19 GMT

వెండితెరపై పోషించిన ఏ పాత్రకైనా వంద శాతం న్యాయం చేసి.. లేడీ సూపర్‌‌స్టార్‌గా ఎదిగింది. అభిమానులతో లేడీ అమితాబ్ అని ప్రేమగా పిలిపించుకుంది. గ్లామర్ పాత్రలతో మెప్పిస్తూనే.. పవర్‌ఫుల్ రోల్స్‌కు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచింది. తెలంగాణ ప్రజలు ఆమెను రాములమ్మగా పిలిచినా.. వెండితెర ప్రముఖులు విశ్వ నటభారతిగా గుర్తించినా.. ఆమెకే చెల్లింది. అసలు పేరు శాంతికి.. తన పిన్ని పేరు ‘విజయ’ను చేర్చుకుని ‘విజయశాంతి’గా సిల్వర్‌‌స్క్రీన్‌పై విజయఢంకా మోగించిన హీరోయిన్ ‘విజయ శాంతి’. బుధవారం పుట్టినరోజు జరుపుకుంటున్న వెండితెర భారతికి.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు విషెస్ అందించారు.

రాజకీయాల్లో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ లేడీ సూపర్‌స్టార్.. మ‌హేశ్‌బాబు ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడమే కాక, ఆమె పోషించిన భార‌తి పాత్ర‌కు కూడా చాలా మంచి పేరొచ్చింది. కాగా బుధ‌వారం ఆమె పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ‘విజ‌య‌శాంతి గారికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు. ఎల్ల‌ప్పుడూ మీరు ఆరోగ్యంగా ఉండాలి. సదా సంతోషం మీ వెంటే ఉండాల‌ని కోరుకుంటున్నాను’ అంటూ సూప‌ర్‌స్టార్ మ‌హేశ్‌బాబు ట్విట్ట‌ర్ ద్వారా విషెస్ చెప్పారు. దీనికి విజయశాంతి బదులిస్తూ.. ‘థ్యాంక్యూ సూపర్‌స్టార్ మహేశ్ బాబు గారు’ అంటూ రిప్లయ్ ఇచ్చారు.

‘హ్యాపీ బర్త్‌డే విజయశాంతి గారు.. మీరు నటించే సినిమాలకు మీరే ఓ పెద్ద అసెట్. సరిలేరు సినిమాకు మీరు అందించిన సహకారాన్ని మాటల్లో చెప్పలేను’ అని దర్శకుడు అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్‌టైన్‌టెమెంట్స్‌తో పాటు బీఏ రాజు, బండ్ల గణేష్ ట్విట్టర్ ద్వారా విజయశాంతికి బ‌ర్త్‌డే విషెష్ తెలిపారు.

Tags:    

Similar News