'విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోండి'

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆమెతో భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. 32 మంది ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించిందన్నారు. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నంగా నిలిచిన విశాఖ ఉక్కు […]

Update: 2021-07-23 10:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఉక్కు కార్మిక సంఘాల నేతలతో కలిసి ఆమెతో భేటీ అయ్యారు. స్టీల్‌ప్లాంట్‌ను విక్రయించే ఆలోచన విరమించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ వినతిపత్రం సమర్పించారు. 32 మంది ఆత్మబలిదానాల అనంతరం విశాఖ ఉక్కు పరిశ్రమ ఆవిర్భవించిందన్నారు. ఈ పరిశ్రమ ఆంధ్రుల మనోభావాలతో ముడిపడి ఉందని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలలో నవరత్నంగా నిలిచిన విశాఖ ఉక్కు ఏపీకే ఆభరణం వంటిదని చెప్పుకొచ్చారు. ఈ పరిశ్రమపై ఆధారపడి 35 వేల మంది ఉద్యోగులు, కార్మికులతోపాటు లక్షకుపైగా కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని తెలిపారు.

స్టీల్‌ ప్లాంట్‌ కారణంగానే విశాఖనగరం మహా నగరంగా విస్తరించి రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన నగరంగా భాసిల్లుతోందని తెలిపారు. కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో విశాఖ ఉక్కు పరిశ్రమ ద్వారా దేశంలోని అనేక ప్రాంతాలకు లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సీజన్‌ను రైళ్ళ ద్వారా తరలించి లక్షలాది మంది ప్రాణాలను నిలబెట్టిందని విజయసాయిరెడ్డి కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ దృష్టికి తీసుకెళ్లారు. సొంతంగా గనులు లేకపోవడం వల్లే విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ నష్టాలను చవిచూడాల్సి వస్తోందన్నారు. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు సొంత గనులు కేటాయించి, అప్పులను ఈక్విటీ కింద మారిస్తే అతి తక్కువ కాలంలోనే విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాట పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తద్వారా ఆ లాభాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి భారీగా డివిడెండ్లు చెల్లిస్తుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు అందజేసిన వినతిపత్రంలో వివరించారు.

Tags:    

Similar News