విజయ్‌‌పై దాడులకు సేతుపతి కారణమా?

వినూత్న ప్రయత్నాలకు కేరాఫ్ అడ్రస్ విజయ్ సేతుపతి. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రకైనా సరేనంటాడు. ప్రతినాయకుడి పాత్ర అయినా ముందుకెళ్తాడు. ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరోలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలివిడిగా ఉంటాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన మాస్టర్‌లో ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే, ఆ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నవిజయ్ సేతుపతిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల విజయ్ ఇంట్లో ఐటీ దాడుల వెనుక విజయ్ సేతుపతే ఉన్నాడంటుూ […]

Update: 2020-02-12 07:49 GMT

వినూత్న ప్రయత్నాలకు కేరాఫ్ అడ్రస్ విజయ్ సేతుపతి. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రకైనా సరేనంటాడు. ప్రతినాయకుడి పాత్ర అయినా ముందుకెళ్తాడు. ప్రధాన పాత్రలో నటిస్తున్న హీరోలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా కలివిడిగా ఉంటాడు. ఇటీవల షూటింగ్ ప్రారంభమైన మాస్టర్‌లో ఇళయదళపతి విజయ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అయితే, ఆ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను చేస్తున్నవిజయ్ సేతుపతిపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇటీవల విజయ్ ఇంట్లో ఐటీ దాడుల వెనుక విజయ్ సేతుపతే ఉన్నాడంటుూ ట్విట్టర్‌లో ఓ డాక్యుమెంట్ హల్‌చల్ చేస్తోంది.
కీ ట్రుత్స్ బిహైండ్ ఐటీ రైడ్స్ ఆన్ విజయ్ (విజయ్‌పై ఐటీ దాడుల వెనుక నిజాలు) అంటూ ఓ డాక్యుమెంట్‌ను కొందరు సోషల్ మీడియాలో పెట్టారు. రాజకీయ నాయకుడి నుంచి విద్యాసంస్థల వ్యాపారిగా జెప్పేర్ కూతురు రెజీనా తమిళనాడులో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగానే తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, ఆర్యలతోపాటు మరికొంత మంది హీరోలూ క్రైస్తవం స్వీకరించారు. వీళ్లు మరికొంత మందిని క్రైస్తవంలోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం జెప్పేర్ విద్యా సంస్థలకు ఓ స్వచ్ఛంద సంస్థ పెద్ద ఎత్తున నిధులను సమకూరుస్తోంది. ఇటీవల విజయ్ నటించి బిగిల్ సినిమా నిర్మాణం మొత్తం ఆ నిధులతోనే చేపట్టారు. దీనిపై ఏడాది కాలంగా ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు దృష్టి సారించారు. ఇందులో భాగంగానే విజయ్ నివాసం, రెజీనా విద్యాసంస్థల్లో ఐటీ దాడులు జరిగాయని, ఇందుకు ఓ రకంగా విజయ్ సేతుపతే కారణమని ఆ డాక్యుమెంట్‌లో ఉంది. దీన్ని విజయ్ సేతుపతి రీట్వీట్ చేస్తూ అనవసర పుకార్లను మానుకోవాలని, ఏదైనా పనిచేసుకోవాలని హితవు పలికాడు.

Tags:    

Similar News