ఈ నెల 20 నుంచి విజయ్ హజారే ట్రోఫీ
ముంబయి: దేశవాళీ వన్డే క్రికెట్ కాంపిటేషన్ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ ఆదివారం సమాచారం అందించింది. ఈ ట్రోఫీలో పాల్గొనే జట్లన్నీ వాళ్లకు కేటాయించిన వేదికకు 13న చేరుకోవాలని, అప్పట్నుంచీ ఆరు రోజులపాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని వెల్లడించింది. క్వారంటైన్ సమయంలోనే కొవిడ్ టెస్టులు చేయనున్నట్టు పేర్కొంది. ఇటీవలే విజయవంతంగా నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మాదిరిగానే ఈ ట్రోఫీనీ […]
ముంబయి: దేశవాళీ వన్డే క్రికెట్ కాంపిటేషన్ విజయ్ హజారే ట్రోఫీ ఈ నెల 20 నుంచి ప్రారంభంకానుంది. ఈ మేరకు రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్లకు బీసీసీఐ ఆదివారం సమాచారం అందించింది. ఈ ట్రోఫీలో పాల్గొనే జట్లన్నీ వాళ్లకు కేటాయించిన వేదికకు 13న చేరుకోవాలని, అప్పట్నుంచీ ఆరు రోజులపాటు ఆటగాళ్లు క్వారంటైన్‌లో ఉండాల్సి ఉంటుందని వెల్లడించింది. క్వారంటైన్ సమయంలోనే కొవిడ్ టెస్టులు చేయనున్నట్టు పేర్కొంది. ఇటీవలే విజయవంతంగా నిర్వహించిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మాదిరిగానే ఈ ట్రోఫీనీ 6 వేదికల్లో జరపాలని చూస్తోంది. జట్లను ఆరు గ్రూపులుగా విభజించి, సూరత్, ఇండోర్, బెంగళూరు, జైపూర్, కోల్‌కతాతోపాటు తమిళనాడులోని ఓ స్టేడియంలో మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ నెల 20 నుంచి మార్చి 1వరకు లీగ్ దశ నిర్వహిస్తారు. ఆ తర్వాత మరోసారి ఆటగాళ్లను క్వారంటైన్‌లో ఉంచి, టెస్టులు చేస్తారు. వీటి అనంతరం మార్చి 8న నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. అదే నెల 11న సెమీఫైనల్స్, 14న ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. కాగా, గత విజయ్ హజారే ట్రోఫీని కర్నాటక జట్టు గెలుచుకుంది.