అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా : విజయ్ దేవరకొండ

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలోని గల్లీలన్నీ జలమయం కాగా, చాలామంది నిరుపేదలు తమ గుడిసెలను కోల్పోయారు. చాలా చోట్ల కరెంట్, నీరు, తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నగరంలో వరద బీభత్సం వల్ల నెలకొన్న పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను ఈ క్షణం మీ అందరికీ దూరంగా ఉన్నందుకు చాలా […]

Update: 2020-10-18 05:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహానగరంలోని గల్లీలన్నీ జలమయం కాగా, చాలామంది నిరుపేదలు తమ గుడిసెలను కోల్పోయారు. చాలా చోట్ల కరెంట్, నీరు, తిండి లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. నగర ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. నగరంలో వరద బీభత్సం వల్ల నెలకొన్న పరిస్థితుల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

‘నేను ఈ క్షణం మీ అందరికీ దూరంగా ఉన్నందుకు చాలా బాధపడుతున్నాను. ప్రతీక్షణం మీ గురించే ఆలోచిస్తూ.. ప్రతీ ఒక్కరు బాగుండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. వీలైనంత త్వరగా ఇంటికి రావడానికి ప్రయత్నిస్తాను. నా ప్రేమ, ధైర్యాన్ని మీకందిస్తున్నాను’ అని విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా తన మనసులోని బాధను పంచుకున్నాడు. విజయ్ దేవరకొండ.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫైటర్ ’ సినిమా షూటింగ్ నిమిత్తం
యూరప్‌ పర్యటనలో ఉన్నాడు.

2020లో కరోనాతో పాటు వరదల వల్ల జరుగుతున్న పరిణామాలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ వైపరీత్యాలు చిన్నారులపైనా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా యాంకర్ అనసూయ కొడుకు తనతో ‘అమ్మ.. మనం తిరిగి 2017, 2018 సంవత్సరాలకు వెళ్లిపోదాం. అప్పుడు కరోనా లేదు, వరదలు లేవు. హ్యాపీ లైఫ్ గడిపాం’ అన్నాడని తన ట్విట్టర్ వేదికగా తెలిపింది. దాంతో తను కన్నీటి పర్యంతమైనట్టు చెప్పుకొచ్చింది. మన రాబోయే తరాలకు మన ఏం అందివ్వబోతున్నాం? అంటూ ఆమె ప్రశ్నించింది.

Tags:    

Similar News